‘RC 17′(RC17) సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులు అయ్యింది. కానీ దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమీ రావడం లేదు. ‘పెద్ది’ రిలీజ్ కోసం సుకుమార్ సైలెంట్ గా ఉంటున్నాడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ‘పెద్ది’ రిలీజ్ అయిపోయింది. ఫలితం అందరికీ తెలిసిందే. ధియేట్రికల్ రన్ అల్మోస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసింది. నిన్న శిల్పకళా వేదికలో ‘పెద్ది’ సక్సెస్ మీట్ పెట్టారు. దీంతో ‘పెద్ది’ ప్రమోషన్స్ అల్మోస్ట్ ముగిసినట్టే..!
అయితే నిన్న జరిగిన ఈవెంట్లో సుకుమార్ స్టేజ్ పైకి రాగానే.. మెగా అభిమానులంతా ఉత్సాహంతో.. ‘RC17’ అప్‌డేట్ కోసం అరిచారు.ఫ్యాన్స్ జోష్ సుకుమార్..కి అర్ధమైంది. కానీ ఎందుకో అతనికి కోపం వచ్చింది. చిరు ఉన్నారని నవ్వుతూ కనిపించినప్పటికీ “RC17 గురించే కదా? ఇప్పుడు నేనేం చెప్పను. సినిమా గురించి బయటపెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీ ఊహలకే వదిలేస్తున్నా.. సారీ అండ్ లవ్ యూ” అంటూ మైక్ యాంకర్ చేతిలో పెట్టేశాడు.
ఇదంతా గమనించినప్పటికీ చిరు ఓ నవ్వు నవ్వేసి వదిలేశారు. అయితే సుకుమార్ చేసిన ఈ పని గతంలో అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ ఇన్సిడెంట్ ను గుర్తుచేసింది అని కొందరు అంటున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. స్వతహాగా సుకుమార్ కామ్ గోయింగ్ పర్సనే. కానీ ఎందుకో నిన్న కొంచెం అప్సెట్ గా కనిపించారు. బహుశా సుకుమార్ ‘పుష్ప 3’ పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.