Sukumar: ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్‌ ఏ సినిమా చేస్తారో?

  • January 2, 2023 / 02:03 PM IST

స్టార్‌ హీరోల సినిమాల లైనప్‌ గురించి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. మా హీరో నెక్స్ట్‌ ఏ సినిమా చేస్తాడు అంటూ లెక్కలేస్తారు. అలాంటి ఫ్యాన్స్ ఓ దర్శకుడి లైనప్‌ కోసం చూస్తున్నారు అంటే అతను ఎంత స్పెషలో అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్పెషల్‌ దర్శకుల్లో సుకుమార్‌ ఒకరు. క్రియేటివిటీ విత్‌ ఎమోషన్స్‌ అనే కాన్సెప్ట్‌తో సినిమాలు తీస్తూ అదరగొడుతున్నారాయన. దీంతో ఆయన నెక్స్ట్‌ ఏంటి అనే ప్రశ్న మొదలైంది. మొన్నీ మధ్య వరకు ఓ హీరో అనుకోగా, ఇప్పుడు ఇంకో హీరో పేరు రావడమే దీనికి కారణం.

‘పుష్ప 2’ తర్వాత సుకుమార్‌ ఏ సినిమా చేయబోతున్నారు? చాలా రోజులుగా ఈ ప్రశ్న వినిపిస్తోంది. సుకుమార్ లెక్కల్లో ఇద్దరు హీరోలున్నారు. ఒకరు రామ్‌చరణ్‌ అయితే, రెండో హీరో విజయ్‌ దేవరకొండ. చరణ్‌ సినిమాకు సంబంధించి ఓ సీన్‌ కూడా షూట్‌ చేశారు అనేది రాజమౌళి ఆ మధ్య చెప్పిన మాట. విజయ్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ కూడా అయ్యింది. దీంతో ఈ ఇద్దరిలో ఒకరితో సినిమా ఉండొచ్చు అని అనుకున్నారంతా. అయితే ఏమైందో ఏమో హఠాత్తుగా లిస్ట్‌లోకి ప్రభాస్‌ సినిమా వచ్చి చేరింది.

దీంతో సుకుమార్‌ నెక్స్ట్‌ ఏంటి? అనే ప్రశ్నకు సమాధానంగా ట్రయాంగిల్‌ సినిమా స్టోరీ అయిపోయింది. అయితే విజయ్‌ సినిమా దాదాపు స్టార్ట్‌ అవ్వడం కష్టమే అనే మాట కూడా వినిపిస్తోంది. దీంతో లెక్కల మాస్టారి నెక్స్ట్‌ మూవీలో రామ్‌చరణ్‌ నటిస్తాడా లేక ప్రభాస్‌ నటిస్తాడా అనేది తెలియడం లేదు. ప్రభాస్‌కు సుకుమార్ చెప్పిన ఓ స్టోరీ లైన్ అదిరిపోయిందని సమాచారం. దీంతో త్వరలో సినిమా చేద్దాం అని ఇద్దరూ అనుకున్నారట అని వార్తలు నడుస్తున్నాయి.

‘పుష్ప 2’ తర్వాత ఇదే అని కూడా అంటున్నారు. అయితే ఈ మధ్య ఓ నిర్మాణ సంస్థ ఈ సినిమా గురించి ఎవరూ అడగకుండానే ‘మేం చేయడం లేదు’ అంటూ ట్వీట్‌ కూడా చేసింది, నిప్పో, మంచో లేకపోతే పొగరాదు అంటారు. మరిప్పుడు ప్రభాస్‌ – సుకుమార్‌ అనే పొగ ఎందుకు వచ్చిందో తెలియాలి. దాని కంటే ముందు చరణ్‌ సినిమా ఏమైందో కూడా తెలియాలి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus