ఇలా ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్ అయిందో లేదో.. అలా తారక్ అభిమానుల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. ఎందుకంటే తారక్‌కు సరైన ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథ పడి బాగుండు అని గత కొన్ని ఏళ్లుగా అనుకుంటున్నారు. అలాంటి దర్శకుడు ఎవరు అంటే.. అది అనిల్ రావిపూడినే అని కూడా అనుకుంటున్నారు. ఆ మధ్య ఏదో సినిమా ప్రచారంలో తారక్‌తోపాటు మరో హీరోను ఇంటర్వ్యూ చేసినప్పుడు అనిల్‌తో ఆయన వైబ్ అదిరిపోయింది. అప్పటి నుండి ఇంకాస్త కోరిక కలిగింది అభిమానులకు.
ఇప్పుడు అనుకున్నట్లుగానే తారక్ – అనిల్ కాంబో సెట్ అవ్వగానే.. మరో రెండు సినిమాల మీద డౌట్స్ క్రియేట్ చేసింది. అందులో ఒక సినిమా గురించి అందరూ మాట్లాడుతున్నారు. అదే ‘గాడ్ ఆఫ్ వార్’. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది అని ఆ మధ్య ఘనంగా ప్రకటించారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ చెప్పారు కూడా. సినిమా ఉండదేమో అని అనుకుంటుండగా.. ఓ పాత ఫొటో (సమాచారం) పోస్ట్ చేసి సినిమా ఉందని టీమ్ చెప్పింది.
దీంతో, ఆ సినిమా ఉంది అనే అనుకుందాం. కానీ మరో ప్రాజెక్ట్ గురించి చర్చ మొదలైంది. నిజానికి ఈ సినిమా ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. అదే తారక్ – నెల్సన్ దిలీప్ కుమార్. కోలీవుడ్‌లో స్టార్ డైరక్టర్‌గా, స్టార్‌లను బాగా హ్యాండిల్ చేస్తారు అనే పేరు నెల్సన్‌కి పేరుంది. అందుకో, ఇంకెందుకో కానీ ఆయనను, తారక్‌ను కలిపి ఓ ప్రాజెక్ట్ చేయాలని నాగవంశీ చాలా నెలలుగా అనుకుంటూ ఉన్నారు.
ఇప్పుడు ఆ సినిమా కూడా డౌట్‌లో పడింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ‘జైలర్ 2’ సినిమా చేసిన తర్వాత ‘కమల్ – రజనీకాంత్’ సినిమా మొదలయ్యేలోపు తారక్‌తో నెల్సన్ ఆ సినిమా చేస్తారేమో అనుకున్నారంతా. ఎందుకంటే ‘గాడ్ ఆఫ్ వార్’కి ఇంకా టైమ్ పడుతుంది అంటున్నారు కాబట్టి. ఇప్పుడు 2028 సంక్రాంతి లక్ష్యంగా అనిల్ రావిపూడితో సినిమ అనేసరికి.. నెల్సన్ ఇప్పట్లో లేనట్లే.. నాగవంశీ కల ఇప్పట్లో నెరవేరనట్లే అని చెప్పొచ్చు.