Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

నిన్న మొన్నటి వరకు ఆ సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి డౌట్‌ లేదు. ఎందుకంటే ‘మన టార్గెట్‌ సంక్రాంతి.. అప్పటివరకు సెలవుల్లేవ్‌’ అని హీరో చెప్పేశాడు. డైరక్టర్‌ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం.. సత్తా చాటుతున్నాం’ అని తేల్చేశారు. కానీ ఉన్నట్లుండి సినిమా విడుదల తేదీ విషయంలో డౌట్స్‌ మొదలయ్యాయి. దానికి కారణం అప్పటికే రెడీగా ఉన్న ఆ హీరో మరో సినిమా అడ్డంకులు దాటుకుని రిలీజ్‌కి రెడీ అవ్వడమే.

Kaaka

ఇదంతా చిరంజీవి – బాబీ సినిమా ‘కాకా’ గురించి.. అలాగే చిరంజీవి – మల్లిడి వశిష్ట సినిమా ‘విశ్వంభర’ గురించే అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. ఈ సినిమాల విడుదల విషయంలో ఇటీవల చిరంజీవి ఇద్దరు నిర్మాతలతోనూ మీటింగ్‌ పెట్టారట. ‘విశ్వంభర’ నిర్మాత విక్కీ.. ‘కాకా’ నిర్మాత కేవీఎన్‌తో కలసి చర్చించుకున్నాక ఓ నిర్ణయం తీసుకున్నారు అని టీమ్‌ సమాచారం. అయితే ఆ నిర్ణయం ఏంటి అనేది ఇంకా క్లారిటీగా చెప్పలేదు.

ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే.. ముందుగా అనుకున్నట్లుగా ‘కాకా’నే పండక్కి తీసుకొస్తారట. ఈ మేరకు అధికారిక సమాచారం ఇస్తారు అంటున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్‌లో ఉండిపోయింది. దాన్ని ఇప్పుడు క్లియర్‌ చేస్తున్నారట. అదే ‘కాకా’ భార్య పాత్ర. ఈ పాత్ర కోసం తొలుత ప్రియమణి పేరు వినిపించింది. కానీ ఆ స్థానాన్ని స్నేహకు ఇచ్చినట్టు సమాచారం.

ఈ సినిమాలో స్నేహ పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని.. ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపిస్తుందని సమాచారం. అయితే ‘కాకా’ రొయ్యల చెరువులు హ్యాండిల్‌ చేసే మేనేజర్‌గా మారడానికి, నీటి కుంటలో తుపాకీలు దాచి పెట్టడానికి.. స్నేహ పాత్రకు సంబంధం ఉంటుంది అని చెబుతున్నారు. అదేంటో తెలియాలి అంటే సంక్రాంతి రావాల్సిందే. అప్పుడు ‘కాకా’ కూడా రావాల్సిందే. ఇది జరగకపోతే ‘విశ్వంభర’ వచ్చి ముల్లోకాల కథ చెబుతాడు.

‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus