Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Advertisement

పారితోషికాలు భారీగా అందుకుంటూ ప్రమోషన్ల పేరు ఎత్తితే సైడ్ అయిపోయే ఆర్టిస్టులు టాలీవుడ్లో ఇప్పుడు చాలా మందే ఉన్నారు. ఇటీవల కాలంలో చూసుకుంటే.. ‘సుయోధన’ అనే సినిమా ప్రమోషన్లకి హీరో ప్రియదర్శి మొహం చాటేశారు అంటూ ఆ చిత్ర నిర్మాత బహిరంగంగానే తన అసహనాన్ని బయటపెట్టారు. ఆ లిస్టులో ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) కూడా చేరినట్టు లేటెస్ట్ టాక్.విషయంలోకి వెళితే.. ఈ వారం ‘పోలీస్ కంప్లైంట్’ అనే సినిమా వస్తుంది.

Varalaxmi Sarathkumar

ఈ సినిమాలో వరలక్ష్మీ అత్యంత కీలక పాత్ర పోషించింది. పోలీస్ లుక్లో ఉన్న ఆమె పాత్రతోనే పోస్టర్లు రిలీజ్ చేస్తూ ప్రమోషన్ చేసుకుంటున్నారు మేకర్స్. అయితే నిన్న జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ కు వరలక్ష్మీ హాజరుకాలేదు. ఈ విషయంపై చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ.. “లక్షల రూపాయిల పారితోషికం తీసుకుని కూడా వరలక్ష్మి, ఈ సినిమా ప్రమోషన్లకు రావడం లేదు. మేము బతిమాలినా… అడుక్కున్నా కూడా ‘టైమ్ లేదు’ అంటూ ఆమె మాట దాటేశారు. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో కూడా తన ‘పెద్ది’ సినిమా కోసం మీడియా ముందుకు వచ్చారు. తన సినిమా గురించి 4 మాటలు మాట్లాడారు. 94 ఏళ్ల వయసులోనూ లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు తన ‘సింగ్ గీతమ్’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.
అంత పెద్ద స్టార్స్ మీడియా ముందుకు వచ్చి తన సినిమాని ప్రమోట్ చేసుకున్నప్పుడు.. వరలక్ష్మీ ఎందుకు రావడం లేదు. ‘పోలీస్ కంప్లైంట్’ సినిమాకి సగం డబ్బింగ్ చెప్పాక ఆమె.. దాదాపు 3 నెలల పాటు అందుబాటులోకి రాలేదు. ఈ గ్యాప్లో ఆమె తన ‘సరస్వతి’ సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. ఏ.. అమెదేనా సినిమా? మాది కాదా?” అంటూ మండిపడ్డాడు దర్శకుడు సంజీవ్ మేగోటి. మరి ఈ చిన్న దర్శకుడి వ్యాఖ్యలపై వరలక్ష్మీ స్పందిస్తుందా? లేక లైట్ తీసుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus