Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Advertisement

సినిమా విడుదల వాయిదా పడటం టాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. ఎప్పుడో అనుకున్న సినిమా ఎప్పుడో రిలీజ్‌ కావడం మనం చాలాసార్లు చూశాం. అందరు హీరోలు ఈ పరిస్థితి దాటుకునే వచ్చి ఉంటారు. అయితే వాయిదా వేసినప్పుడు కొత్త రిలీజ్‌ డేట్‌ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది అంటే ఇబ్బందే అని చెప్పాలి. అది సినిమా టీమ్‌కే కాదు.. ఆ సినిమా హీరో ఫ్యాన్స్‌కి కూడా. ఎందుకంటే సోషల్‌ మీడియాలో వాళ్ల ఇజ్జత్‌ ఊసిపోతుంది కాబట్టి. ఇప్పుడు రామ్‌చరణ్‌ (Ram Charan) ఫ్యాన్స్‌ పరిస్థితి ఇదే. ఎందుకంటే అనుకున్నట్లుగానే ‘పెద్ది’ (Peddi) సినిమా వాయిదా పడింది.

Peddi Movie

‘పెద్ది’ సినిమాను వాయిదా వేస్తే వేశార కానీ.. రిలీజ్‌ డేట్‌ చెప్పలేదు. అదే ఇంకా ఇబ్బంది పెట్టే విషయం. జూన్‌ నెలలో వస్తాం అని చెప్పారు కానీ.. ఏ రోజు రిలీజ్‌ చేస్తారు అనేది చెప్పలేదు. అంటే ఆరో నెలలో ఉన్న నాలు వారాల్లో ఏదో ఒక వారం తీసుకొస్తారని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఇబ్బందికరంగా మారింది. ‘పెద్ది’ (Peddi) సినిమా సాంగ్స్‌, గ్లింప్స్‌కి మీరు చూపిన ఆదరణకు ధన్యవాదాలు. సినిమా టాకీ పార్ట్‌ షూటింగ్‌ పూర్తయింది. ఒక్క పాట షూటింగ్‌ మిగిలి ఉంది అని టీమ్‌ పోస్ట్‌ పోన్‌ గురించి చెబుతూ అప్‌డేట్ ఇచ్చింది.

ఇప్పటివరకు వచ్చిన సినిమా అవుట్‌పుట్‌తో సంతోషంగా ఉన్నాం. ఇంత గొప్ప కంటెంట్‌ మా చేతిలో ఉంది కాబట్టి దానిని మరింత బాగా ప్రెజెంట్‌ చేయాలని అనుకుంటున్నాం. అందుకే పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ వర్క్‌కు సంబంధించి మా టీమ్‌కి మరికొంత సమయం ఇవ్వడం ముఖ్యం అనుకున్నాం. ప్రేక్షకులకు బెస్ట్‌ థియేట్రికల్‌ అనుభూతి ఇవ్వడం మా బాధ్యత. దీనిని దృష్టిలో పెట్టుకుని సినిమాను వాయిదా వేశాం అని ‘పెద్ది’ (Peddi) ఓ నోట్‌ రిలీజ్‌ చేసింది. మార్చిలో ఆఖరి వారంలో రావాల్సిన ఈ సినిమాను తొలుత ఏప్రిల్‌ 30కు వాయిదా వేశారు. ఇప్పుడు జూన్‌ అంటున్నారు.

డేట్‌ ఎందుకు చెప్పలేదు అనే పాయింట్‌కి వస్తే.. ‘టాక్సిక్‌’ సినిమానే దానికి కారణం అని అంటున్నారు. ఆ సినిమా జూన్‌ 4న రావాల్సి ఉంది. అయితే వస్తుందా లేదా అనేది తెలియడం లేదు. ఆ సినిమా లెక్క తేలితేనే ‘పెద్ది’ (Peddi) రిలీజ్‌ డేట్ చెప్పాలని అనుకుంటున్నారట. రెండూ పాన్‌ ఇండియా సినిమాలు కావడం వల్ల రిలీజ్‌ దగ్గర ఇబ్బంది ఉండకుండా ఈ ప్రయత్నాలు అని సమాచారం.

తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus