సౌత్ లో శృతి హాసన్ ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఉంది. కెరీర్ బిగినింగ్ లో ఐరన్ లెగ్ గా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న శృతి, ఆ తరువాత గబ్బర్ సింగ్, రేసు గుర్రం వంటి భారీ హిట్స్ తో ఆ నెగెటివ్ ట్యాగ్ పోగొట్టుకుంది. ఇక శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ తో తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది, ఇదే సమయంలో శృతి లండన్ యువకుడు మైఖేల్ కోర్ల్సే ప్రేమలో పడింది. ఆ ప్రేమ మైకంలో కెరీర్ ని పక్కన పెట్టింది. అతనితో చట్టపట్టాలేసుకోని చాలా కాలం తిరిగింది.
ఇక పెళ్లే తరువాయి అనుకుంటున్న సమయంలో మైఖేల్, శృతి హాసన్ తో విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. బ్రేక్ అప్ తరువాత శృతి హాసన్ కొన్నాళ్లు లండన్ లో గడిపారు. అక్కడ కొన్నాళ్ళు లైవ్ మ్యూజిక్ షోస్ చేసిన శృతి, గత ఏడాది ఇండియాకి రావడం జరిగింది. ఐతే అమ్మడుకి అప్పుడు మాదిరిగా స్టార్ హీరోల పక్కన అవకాశాలు ఐతే రాలేదు. కాగా ఈ శృతి హాసన్ త్వరలో ఓ మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ పెట్టనున్నారట.
తన ఛానెల్ ద్వారా తన లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్ వీడియోలు మరియు తన సింగింగ్ వీడియోలు పంచుకుంటుందట. త్వరోనే ఆమె ఈ ఛానల్ ప్రారంభించన్నట్లు తెలుస్తుంది. కోట్లు కురిపించే ఆఫర్స్ వస్తున్న సమయంలో కెరీర్ ని నిర్లక్ష్యం చేసి, శృతి ఇప్పుడు చిల్లర కోసం తాపత్రయ పడుతుందని అందరూ అనుకుంటున్నారు. ఏదైనా అందివచ్చిన అవకాశం వదులుకుంటే తరువాత పర్యవసానాలు ఇలాగే ఉన్నాయి.
Most Recommended Video
40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?