స్టార్‌ హీరోల సినిమాలు… ఇదేం రిలీజ్‌ డేట్‌లు… ఏం జరుగుతోంది?

  • April 8, 2024 / 11:23 AM IST

సినిమాలు స్టార్ట్‌ అవుతున్నప్పుడే రిలీజ్‌ డేట్‌లు చెప్పేయడం బాలీవుడ్‌కి అలవాటు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి అక్కడ లేదు. అలా ఉన్నా ఆ సినిమాలు అనుకున్న సమయానికి రావడం లేదు. అయితే సౌత్‌ సినిమాలో కొంతమంది ట్రై చేసి ఫెయిల్‌ అయ్యారు. ఆ తర్వాత సినిమా రిలీజ్‌కి అంతా సిద్ధం అనుకున్నాక రిలీజ్‌ డేట్‌లు ఇప్పుడు చెబుతున్నారు. ఇదీ వర్కవుట్‌ కావడం లేదు. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాతలు కొత్త ఆలోచన చేశారా? చూస్తుంటే అదే అనిపిస్తోంది.

సినిమా రిలీజ్‌ డేట్‌ చెబుతాం అంటూ టీమ్‌ ఊరించి, ఊరించి ఆఖరికి సినిమా నెల చెబుతున్నారు తప్ప.. రిలీజ్‌ డేట్‌ చెప్పడం లేదు. ఇదేదో కొత్త రకం ప్రయత్నంలా కనిపిస్తోంది. తాజాగా ఇదే కాన్సెప్ట్‌లో రెండు పెద్ద సినిమాలు రిలీజ్‌ మంత్‌ను మాత్రం చెప్పాయి. కొత్త పోస్టర్ల మీద కేవలం నెల మాత్రమే కనిపిస్తోంది. ఆ సినిమాల్లో ఒకటి కమల్‌ హాసన్‌ (Kamal Haasan) – శంకర్‌ (Shankar) ‘భారతీయుడు 2’ (Indian2) ఒకటి అయితే, రెండోది రజనీకాంత్‌ (Rajinikanth) ‘వేట్టయాన్‌’. కావాలంటే ఆ సినిమాల పోస్టర్లు మీరే చూడండి.

చాలా నెలల క్రితమే మొదలై ఇటీవలషూటింగ్‌ పూర్తి చేసుకున్న సినిమా ‘భారతీయుడు 2’. ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్‌ చేస్తారా అని కమల్‌ హాసన్‌ ఫ్యాన్స్‌, రామ్‌చరణ్‌ (Ram Charan) ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టీమ్‌ జూన్‌ నెలలో సినిమా రిలీజ్‌ చేస్తారని చెప్పారు. జూన్‌ 13న ఈ సినిమా రిలీజ్‌ చేస్తారని ప్రాథమిక సమాచారం. మరి అసలు డేట్‌ ఎప్పుడు చెబుతారో చూడాలి.

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెబుతూ ‘వేట్టయాన్’ సినిమా రిలీజ్‌ అనౌన్స్‌ చేసింది. ఇక్కడా డేట్‌ అనే కంటే మంత్‌ అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. నెల చెప్పలేదు. అయితే అక్టోబరు 10న సినిమా రిలీజ్‌ అవుతుందని అంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus