Jr NTR: చావు ఎదురొస్తే దానిని స్వీకరించాలి.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

  • April 7, 2024 / 08:41 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఏ విషయం గురించి మాట్లాడినా చాలా మెచ్యూరిటీతో మాట్లాడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రతి విషయం గురించి తారక్ లోతుగా ఆలోచిస్తారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో సినిమాలకే పరిమితమైన తారక్ 2009 సంవత్సరంలో టీడీపీ తరపున ప్రచారం చేసి తిరిగి వస్తుండగా కారుకు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఆ యాక్సిడెంట్ సమయంలో ఎదురైన అనుభవాల గురించి తారక్ పంచుకున్నారు. మనం జీవించి ఉన్న సమయంలో జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే ఏదో ఒకటి సాధించాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

చావు ఎదురొస్తే చావును స్వీకరించాలని ఆయన తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో నేను చనిపోనని బలమైన నమ్మకం నాలో ఉందని ఆ నమ్మకమే చివరకు నిజమైందని తారక్ పేర్కొన్నారు. నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉందనే భావన కూడా అందుకు కారణమని ఆయన తెలిపారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని ఒళ్లు దగ్గర పెట్టుకుని మనం చేయాల్సినవి త్వరగా చేయాలని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.

యాక్సిడెంట్ తర్వాత ఇలా ఆలోచించేంత మెచ్యూరిటీ కొంతమందిలో మాత్రమే ఉంటుందని ఆ విషయంలో తారక్ ను ఎంతో అభినందించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు టిల్లూ స్క్వేర్ సక్సెస్ మీట్ లో తారక్ దేవర (Devara) సినిమా అప్ డేట్ ఇస్తారేమో చూడాలి. సరైన డేట్ దొరికితే దేవర సినిమా ప్రీపోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఇకపై తారక్ సినిమాలు వేగంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వార్2 సినిమా సైతం ఇప్పటికే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సెకండాఫ్ లో వార్2 రిలీజ్ కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus