Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

తెలుగు చిత్రసీమను ఏళ్లుగా ఏలుతున్న ఇంద్రసేనుడు, ప్రజలందరి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మెగాస్టారుడు, పద్మ విభీషణుడు. లెక్కలేనన్ని అవార్డులు, కోట్లలో ప్రజల ఆశీర్వాదాలు.. ఇన్ని ఉన్నా చిరంజీవికి మాత్రం తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. అదేంటంటే.. తన ఇంట్లో ఒక మనవడు ఉండాలి అని. పాపం ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి తన కోరికను బయటపెట్టినందుకు సోషల్ మీడియా మొత్తం నానా యాగీ అయ్యింది. అయితే.. ఇంతటి సామ్రాజ్యాన్ని నెలకొల్పిన చిరంజీవి కోరికలో ఎలాంటి తప్పు లేదు.

Chiranjeevi

చిరంజీవి ఇద్దరు కూతుర్లకు మగ పిల్లలు లేరు. రామ్ చరణ్ అయినా ఆ ఆశ తీరుస్తాడని చాలా ఊహించుకున్నాడు చిరు. అది జరగకపోవడంతో నిరాశపడకపోయినా.. చిన్నపాటి ఆలోచన మాత్రం ఉండిపోయింది ఆయనకి. అయితే.. ఇవాళ ఉపాసన రెండోసారి గర్భవతి అయ్యింది అనే వార్త వచ్చేసరికి.. మెగా అభిమానులు అందరూ మూకుమ్మడిగా ఈసారీ పుట్టేది మాత్రం మగ బిడ్డే అని ఫిక్స్ అయిపోయి.. రకరకాల చోట్ల పూజలు కూడా చేసేస్తున్నారట. మెగా వారసుడి ఆగమనం కోసం చిరంజీవి మాత్రమే కాదు.. మెగా అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

పాపం ఉపాసన మీద ఇది ఒక రకంగా ప్రెజర్ అనే చెప్పాలి. మరి పుట్టబోయేది వారసుడా లేక వారసురాలా? చిరంజీవి చిరకాల కోరిక నెరవేరుతుందా? అనేది తెలియాలంటే కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే.. మెగా ఫ్యామిలీ మొత్తం ఉపాసన రెండోసారి గర్భవతి అయ్యిన విశేష సందర్భాన్ని చాలా ఆడంబరంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సదరు వీడియో ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రామ్ చరణ్ కళ్ళల్లో ఆనందం చూసి మెగా అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వచ్చే ఏడాది చిరంజీవి రెండు సినిమాలు.. మన శంకర వరప్రసాద్ గారు, విశ్వంభర రిలీజ్ అవుతుండగా.. రామ్ చరణ్ పెద్ది కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. చూస్తుంటే.. 2026 మెగా కుటుంబానికి స్పెషల్ ఇయర్ అయ్యేలా ఉంది.

 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

ప్రభాస్ కి ఓం రౌత్ బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus