Om Raut, Prabhas: ప్రభాస్ కి ఓం రౌత్ బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?

ఓం రౌత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘తానాజీ’ తో బాలీవుడ్లో ఓ హిట్టు కొట్టాడు. ఆ వెంటనే ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ‘టి సిరీస్’ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. ప్రభాస్ శ్రీరాముని పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. మొదట రామాయణంలోని ఎవ్వరికీ తెలియని కోణాన్ని ఆవిష్కరించబోతున్నట్టు టీం చెప్పుకొచ్చింది. కానీ చివరికి రామాయణాన్నే అటు తిప్పి.. ఇటు తిప్పి తీశాడు ఓం. 2023 జూన్ 16న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది.

Om Raut, Prabhas

ప్రభాస్ ఇమేజ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ చివరికి నష్టాలు తప్పలేదు. సరే సినిమా ఫలితం సంగతి పక్కన పెట్టేస్తే.. ‘ఆదిపురుష్’ ని ఇష్టానుసారంగా తీశాడు ఓం రౌత్. అది ఒక రకంగా రామయాన్ని వక్రీకరించినట్టు అయ్యింది. అలాగే ప్రభాస్ లుక్స్ కూడా దారుణంగా ఉంటాయి. వాటిపై ట్రోలింగ్ కూడా దారుణంగా జరిగింది. అసలు ‘ ‘ఆదిపురుష్’ అనే సినిమాని ప్రభాస్ ఎందుకు ఒప్పుకున్నాడు?’ అంటూ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. వాస్తవానికి ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రాజెక్టుకి మొదట అంగీకరించలేదు.. తర్వాత పట్టుబట్టి అతన్ని ఒప్పించాను అంటూ స్వయంగా దర్శకుడు ఓం ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

ఈ కారణంతో అతన్ని మరింతగా ట్రోల్ చేశారు అభిమానులు. ఏదేమైనా ‘ఆదిపురుష్’ తర్వాత ప్రభాస్ కి ‘సలార్’ ‘కల్కి 2898 ad’ రూపంలో 2 హిట్లు పడ్డాయి. నెక్స్ట్ చేయబోయే సినిమాలపై కూడా అభిమానుల్లో ఆసక్తి ఉంది. అన్నిటికీ తోడు ఈరోజు ప్రభాస్ బర్త్ డే. ఫ్యాన్స్ ఓ పండుగలా ప్రభాస్ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ కి సీలబ్రిటీలు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్లు వేస్తున్నారు.

ఈ క్రమంలో ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ కూడా ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెబుతూ ‘ఆదిపురుష్’ ఆన్ లొకేషన్ పిక్స్ ను షేర్ చేస్తూ ఓ ట్వీట్ వేశాడు. అంతే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు అనే చెప్పాలి. ఇష్టమొచ్చిన పదజాలంతో అతన్ని దూషిస్తున్నారు. ఈ క్రమంలో ‘మరికొంత మంది ఓం రౌత్.. ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus