కరోనా ఎఫెక్ట్ ఎన్టీఆర్ నుండి ఆర్ ఆర్ ఆర్ రావడమే కష్టం…!

Advertisement

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన్ని వెండితెరపై బాగా మిస్ అవుతున్నారు. ఆయన వెండితెరపై కనిపించి ఏడాదిన్నర అవుతుంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఏడాదికి మించి గ్యాప్ తీసుకోలేదు. ఆయన హీరోగా మొదలుపెట్టిన తరువాత 2009లో మాత్రమే ఆయన నుండి సినిమా రాలేదు. మళ్ళీ పదేళ్ల తరువాత ఎన్టీఆర్ ని 2019లో ఆ గ్యాప్ వెంటాడింది. 2020లో ఆర్ ఆర్ ఆర్ వస్తుంది అనుకుంటే అది కూడా 2021లో పోస్ట్ ఫోన్ అయ్యింది. ఒకే… లేటైనా 2021లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇస్తారని అందరూ భావించారు.

ఐతే అది కూడా జరిగే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ తన 31వ చిత్రం డైరెక్టర్ త్రివిక్రమ్ తో ప్రకటించారు. ఆ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ లో మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయాలని ప్లాన్ వేశారు. దీనితో మూడు నెలల గ్యాప్ లో ఎన్టీఆర్ నుండి 2021లో రెండు సినిమాలు వస్తాయని ఫ్యాన్స్ భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఎన్టీఆర్ కి ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేయడం పెద్ద కష్టంగా మారేలా కనిపిస్తుంది.

దేశంలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకు పెరిగిపోతుంది. ఆర్ ఆర్ ఆర్ మిగిలిన షూటింగ్ మొత్తం సెట్స్ లో పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. అవుట్ డోర్ షూటింగ్ కి పక్కరాష్ట్రల అనుమతి లేదు. అలాగే ముంబై మరియు విదేశీ నటులు షూటింగ్ కి హాజరుకాలేరు. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తిచేయడం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఏక కాలంలో త్రివిక్రమ్ మూవీ కూడా పూర్తి చేసి 2021లో విడుదల చేస్తారు అనేది అసాధ్యం.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus