కోలీవుడ్ లో పూజా హెగ్డే సక్సెస్ సాధిస్తారా..?

  • April 25, 2021 / 08:47 PM IST

టాలీవుడ్, బాలీవుడ్, ఇతర భాషల్లో రష్మిక మందన్నా స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తరువాత కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. అయితే కోలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఒక విషయంలో పూజా హెగ్డే భయపడుతున్నారని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం తమిళనాడులో రష్మిక గుండు ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కార్తీ నటించిన సుల్తాన్ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించారు.

ఆ సినిమా రష్మిక వల్లే ఫ్లాప్ అయిందని భావించిన కొందరు కార్తీ అభిమానులు రష్మిక గుండుతో ఉన్న ఫోటోలను తెగ వైరల్ చేశారు. గతంలో కూడా నయనతార, కీర్తి సురేష్ విషయంలో ఇదే విధంగా జరిగింది. పూజా హెగ్డే నటించబోయే సినిమా హిట్టైతే ఏ సమస్య లేదు కానీ ఫ్లాప్ అయితే మాత్రం పూజా హెగ్డేను కూడా ఢీఫేమ్ చేసే అవకాశం ఉంటుంది. టాలీవుడ్ లో పూజా హెగ్డే నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు హిట్ అయ్యాయి.

ఈ ఏడాది పూజా హెగ్డే నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానుండగా ఆ సినిమాలు కూడా హిట్ అవుతాయని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగులో సత్తా చాటిన పూజా హెగ్డే తమిళంలో కూడా ఇదే స్థాయిలో సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. తమిళంలో విజయ్ తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్డే అక్కడ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus