Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Advertisement

ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన సినిమాలు తీసే వ్యక్తి.. చెప్పిన డేట్‌కి సినిమాలు రిలీజ్‌ చేసే అలవాటు లేని వ్యక్తి టాలీవుడ్‌లో ఎవరైనా ఉన్నారా అంటే అది రాజమౌళి ఒక్కరే అని చెప్పొచ్చు. కెరీర్‌ తొలి నాళ్లలో బాగానే అనుకున్న టైమ్‌కి సినిమాలు రిలీజ్‌ చేసిన ఆయన.. ఆ తర్వాత పెద్ద సినిమాలు, పాన్‌ ఇండియా సినిమాలు తీయడం స్టార్ట్‌ చేశాక రిలీజ్‌ చేయలేకపోతున్నారు. పెద్ద సినిమా కదా ఆ మాత్రం ఆలస్యాలు అవుతాయి లెండి. ఇప్పుడు ఈ డిస్కషన్‌ ఎందుకు అనుకుంటున్నారా? ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా ‘వారణాసి’ విడుదలకు ఇంకా ఒక సంవత్సరమే ఉందంటూ సినిమా టీమ్‌ నిన్నంతా హడావుడి చేసింది కాబట్టి.

Varanasi

మహేశ్‌బాబు – రాజమౌళి – ప్రియాంక చోప్రా – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల చేస్తామని టీమ్‌ ఇప్పటికే అనౌన్స్‌ చేసింది. దానికి 365 డేస్‌ కౌంట్‌డౌన్‌ను కూడా స్టార్ట్‌ చేశారు. ఆ సినిమా సంగీత దర్శకుడు కీరవాణి ‘365’ అంటూ పోస్ట్‌ పెట్టారు. ఆ తర్వాత ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన కార్తికేయ స్పందిస్తూ.. ‘‘అది సరే.. పాట ఎప్పుడు డెలివరీ చేస్తారు’’ అని అడిగారు. దానికి ‘సెట్‌ వేస్తున్నారంటగా.. డైరెక్టర్‌ హ్యాపీ ఆ..!’ అంటూ ‘పోకిరి’ స్టైల్‌లో ఈ సంభాషణ జరిగింది.

దీంతో ఆ పాటేంటి, కొత్త సెట్‌ ఏంటి? అనే చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది. అయితే ఇదంతా మే 31న రాబోయే అప్డేట్‌ గురించే అనే చర్చ కూడా సాగుతోంది. ఆ రోజు మహేష్ బాబు తండ్రి.. దివంగత ప్రముఖ నటుడు కృష్ణ జయంతి. ఆ సందర్భంగా మహేష్‌ అభిమానులకు ఏదైనా సర్‌ప్రైజ్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ 70 శాతం పూర్తయిందని సమాచారం. జూన్‌ నాటికి షూటింగ్‌ మొత్తం పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారట. ఆ తర్వాత సమయాన్ని వీఎఫ్‌ఎక్స్‌ కోసం తీసుకుంటారట.

అయితే, ఆ మధ్య ఆంటార్కిటికాలో కలుద్దాం అని మహేష్‌బాబుతో ప్రియాంక చోప్రా అన్నారు. మరి అక్కడికి ఎప్పుడు వెళ్తారు అనేది చూడాలి. మిగిలిన 30 శాతం షూటింగ్‌లో ఆ షెడ్యూల్‌ ఉందేమో. అయితే ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద స్టార్‌ కాస్ట్‌తో అంత త్వరగా సినిమా పూర్తి చేశారు అంటే రాజమౌళి ప్లానింగే ప్లానింగ్‌. అన్నట్లు వర్క్‌ ఇంత ఫాస్ట్ అయిపోయిందని టీమ్‌ చిన్న సమ్మర్‌ టూర్‌లు ప్లాన్‌ చేసుకుంటున్నారట. అవయ్యాక సినిమా షూటింగ్‌ షురూ చేస్తారట.

 పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus