తారక్ కు త్రివిక్రమ్ కథ రెడీ చేస్తాడా ?

  • September 10, 2016 / 01:35 PM IST

కథల ఎంపికలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పంథా మార్చారు. అయన తాజా సినిమాలు నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లను గమనిస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కుటుంబ అనుబంధాలు, కొంత మెసేజ్ ఉండేలా చూసుకుంటున్నారు. తన ఇమేజ్ ని పక్కన పెట్టి కథా బలమున్న సినిమాలు చేయడానికి  ఆసక్తి కనబరుస్తున్నారు. రీసెంట్ గా వక్కంతం వంశీ చెప్పిన కథ రొటీన్ గా ఉండడంతో దానిని పక్కన పెట్టారని తెలిసింది.

ఫ్యామిలీ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని తనకోసం కథ రెడీ చేయమని తారక్ అడిగినట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఎప్పుడూ అడగని ఎన్టీఆర్ తొలిసారి నోరు తెరిచి అడిగేసరికి ఏమి చెప్పాలో తెలియక  త్రివిక్రమ్ ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. ఓ వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మూడో సారి కలిసి పని చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తూ, మరో వైపు సొంతంగా సినిమాలను నిర్మించాలని ప్రయత్నిస్తూ బిజీగా ఉన్న మాటల మాంత్రికుడు తారక్ కోసం కథ చేస్తాడా ? అని సినీ ప్రముఖులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తారక్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని నందమూరి అభిమానులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus