KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

Advertisement

‘కేడీ: ది డెవిల్‌’ సినిమాలోని ‘సర్కే చునార్‌ తేరీ సర్కే..’ పాట పంచాయితీ ఇప్పట్లో తేలేలా లేదు. ఆ పాటను స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ను తొలగించేశారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కమిషన్‌ ఎదుట ఆ పాటకు, సినిమాకు సంబంధించిన టీమ్‌ హాజరవ్వాల్సి ఉంది. అయితే హాజరు విషయంలో తమ ఆదేశాలకు అనుగుణంగా చిత్రబృందం నడుచుకోలేదని జాతీయ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

KD The Devil

ధ్రువ్‌ సర్జా ప్రధాన పాత్రలో నటించిన ‘కేడీ: ది డెవిల్‌’ సినిమాకు ప్రేమ్ దర్శకత్వంలో వహించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ‘సర్కే చునార్‌ తేరీ సర్కే..’ అనే పాటను రిలీజ్‌ చేశారు. అందులో సంజయ్‌ దత్‌, నోరా ఫతేహీ ఆడిపాడారు. ఆ పాట లిరిక్‌ అసభ్యకరంగా ఉందని.. పెద్ద ఎత్తున వివాదమైంది. దీంతో ఆలిండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ చేసిన ఫిర్యాదు మేరకే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేసింది. దీనికి మినిస్ట్రీ స్పందించి ఈ మేరకు సెన్సార్‌ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలంటూ నోరా ఫతేహి, సంజయ్‌దత్‌కు జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. అయితే, ఏప్రిల్‌ 6న జరిగిన విచారణకు నోరా ఫతేహి తరఫున ఆమె లాయర్‌ హాజరయ్యారు. దీనిపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోరా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. దీనికి గాను ఏప్రిల్‌ 27 వరకూ సమయం ఇచ్చింది. ఇక నటుడు సంజయ్‌ దత్‌ కచ్చితంగా ఏప్రిల్‌ 8న హాజరుకావాలని తెలిపింది.

ఇక ఈ పాట రచయిత రకీబ్‌ ఆలం, దర్శకుడు ప్రేమ్‌, నిర్మాతలు ఇప్పటికే కమిషన్‌కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పాటను ఇప్పటికే యూట్యూబ్‌ నుండి తొలగించినట్లు కూడా తెలిపారు. అయితే పాట లిరిక్స్‌పై మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయ రహాత్కర్‌ మాట్లాడుతూ.. పాటలోని సాహిత్యం అభ్యంతరకరంగా ఉంది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉంది. ఈ పాట లిరిక్స్‌ అర్థం తెలియదని సాకులు చెప్పడం సరికాదు అని చెప్పారు.

రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus