Writer Padmabhushan Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘రైటర్ పద్మభూషణ్’ ..!

  • February 7, 2023 / 06:08 PM IST

‘ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్’ అండ్ ‘లహరి ఫిలిమ్స్’ బ్యానర్ల పై సుహాస్ హీరోగా టీనా శిల్ప రాజ్ రోహిణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షణ్ముఖ ప్రశాంత్ ఈ చిత్రానికి దర్శకుడు. ఫిబ్రవరి 3న ఎటువంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. సుహాస్ ప్రేక్షకుల్లో కొంత క్రేజ్ సంపాదించుకున్న నటుడు కావడంతో ఈవెనింగ్ షోలకు కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.

ఓవర్సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది ఈ చిత్రం. దీంతో ఫైనల్ గా ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది ఈ మూవీ.సోమవారం రోజున కూడా ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.96 cr
సీడెడ్ 0.33 cr
ఆంధ్ర(టోటల్) 1.03 cr
ఏపీ + తెలంగాణ 2.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.06 cr
ఓవర్సీస్ 0.65 cr
వరల్డ్ వైడ్ టోటల్ 3.03 cr

‘రైటర్ పద్మభూషణ్’ చిత్రానికి రూ.1.75 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.3.03 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. బయ్యర్స్ కు ఈ మూవీ రూ.1.28 కోట్ల లాభాలను అందించి సూపర్ హిట్ గా నిలిచింది. సుహాస్ హీరోగా మొదటి థియేట్రికల్ సక్సెస్ అందుకున్న మూవీగా ‘రైటర్ పద్మభూషణ్’ నిలిచింది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus