Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

సినిమా రంగంలో ఉన్న వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్న కుటుంబాలతో సంబంధాలు(వివాహ సంబంధాలు) కలుపుకోవడం ఎక్కువగా చూస్తుంటాం. కానీ స్పొర్ట్స్ రంగంలో ఉన్న వారితో సంబంధాలు కలుపుకోవడం అనేది అరుదు. అయితే ఇండియన్స్ కి మాత్రం… సినిమా, క్రికెట్ అనేవి రెండూ .. రెండు కళ్లు వంటివి. ఈ రెండు రంగాలకు చెందిన ఇద్దరు క్రేజీ సెలబ్రిటీలు త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.

Anirudh Ravichander

వాళ్ళు మరెవరో కాదు.. తన సంగీతంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander), అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్య మారన్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు ప్రచారం గట్టిగానే జరుగుతుంది.సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయంపై అనిరుధ్ టీం క్లారిటీ ఇచ్చింది లేదు.

కానీ అనిరుధ్‌కు వరుసకు పెద్దనాన్న వరుస అయినటువంటి సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ మాత్రం స్పందించి క్లారిటీ కాదు కానీ హింట్ అయితే ఇచ్చారు అని చెప్పాలి. ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను కూడా ఈ వార్తలు విన్నాను, నిజంగానే ఈ పెళ్లి జరిగితే చాలా బాగుంటుంది.అంత పెద్ద క్రికెట్ ఫ్రాంచైజీని ఒంటిచేత్తో సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారు కావ్య. తండ్రికి తగ్గ తనయగా వ్యాపార లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు.

అనిరుధ్, కావ్య జోడీ చూడటానికి చాలా బాగుంటుంది. వీళ్ళ పెళ్లి జరిగితే బెస్ట్ ‘మ్యూజికల్ బిజినెస్’ పెయిర్ అనిపించుకుంటారు” అంటూ చమత్కరించారు వైజీ మహేంద్రన్.

3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus