Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కన్నడ స్టార్ యశ్, ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ సినిమాపై భారీ ఆసక్తిని పెంచింది.

Toxic

అయితే టీజర్, పాటల్లో కనిపించిన కొన్ని విజువల్స్ కారణంగా ఈ సినిమా పూర్తిగా అడల్ట్ కంటెంట్‌తో ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో బలంగా సాగింది. దీంతో చాలామంది ఇది కుటుంబ ప్రేక్షకులకు దూరంగా ఉండే సినిమా కావచ్చని భావించారు.

ఈ ప్రచారాలపై తాజాగా యశ్ స్పందించినట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, ‘టాక్సిక్’ కథ స్వాతంత్య్రం తర్వాత కూడా పోర్చుగీస్ పాలనలో కొనసాగిన భారతదేశంలోని కొన్ని ప్రాంతాల చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని సాగుతుందట. అధికారం, అక్రమ వ్యాపారాలు, గ్యాంగ్‌స్టర్ ప్రపంచం చుట్టూ తిరిగే ఈ కథలో బలమైన భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేశారని చెప్పారు.

ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల అనుబంధం, తండ్రి-కొడుకుల మధ్య ప్రతీకారం, ప్రేమకథ వంటి అంశాలు కథలో కీలకంగా ఉంటాయని యశ్ చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. దీంతో ఇప్పటివరకు అడల్ట్ యాక్షన్ డ్రామాగా భావించిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ సినిమాను ఎమోషనల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా చూడడం ప్రారంభించారు.

ఇక యశ్ చెల్లెలి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న అంశం మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. చిత్రబృందం దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వకపోవడంతో అభిమానులు తమ తమ అంచనాలను వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘టాక్సిక్’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కథపై నెలకొన్న సందేహాలకు యశ్ ఇచ్చిన తాజా వివరణతో సినిమాపై అంచనాలు మరోస్థాయికి చేరుకున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus