Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Advertisement

‘బలగం’ సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వేణు ఎల్దండి ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. గ్రామీణ నేపథ్యంతో భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపి తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హీరో ఎంపిక నుంచే ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Yellamma

మొదట ఈ కథ కోసం నాని, నితిన్ పేర్లు వినిపించినా, కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుంచి దూరమైనట్లు టాక్. ఆ తర్వాత అనూహ్యంగా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ను హీరోగా ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమాతో DSP పూర్తి స్థాయి కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రానుండటం ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు, సంగీత బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తున్నారు.

ఇక హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా మేకర్స్ చాలానే ఆలోచించినట్లు తెలుస్తోంది. మొదట సాయి పల్లవి ఆ తర్వాత కీర్తి సురేష్ పేర్లు బలంగా వినిపించాయి. అలాగే శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయని టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం, ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్‌గా ఫైనల్ చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయట. ‘సీతారామం’ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మృణాల్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే, సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయం అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. మొత్తానికి ‘ఎల్లమ్మ’ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వెయిటింగ్ ప్రాజెక్ట్ లలో ఒకటిగా చెప్పవచ్చు.

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus