Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

Advertisement

‘అందాల రాక్షసి’తో టాలీవుడ్‌కు క్యూట్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’ ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి సూపర్ హిట్స్ అందుకున్న ఆమె.. వరుణ్ తేజ్‌తో లవ్‌లో పడి మెగా కోడలిగా ప్రమోషన్ పొందింది.

Lavanya Tripathi

అయితే సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక కెరీర్‌కు గ్యాప్ ఇస్తుంటారు. కానీ లావణ్య మాత్రం దానికి భిన్నంగా తన యాక్టింగ్ కెరీర్‌ను కంటిన్యూ చేయాలనే డెసిషన్ తీసుకుంది.

మెగా కోడలు హోదాలో లావణ్య త్రిపాఠి నటించిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘సతీ లీలావతి’ ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ‘భీమిలి కబడ్డీ జట్టు’తో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సత్య తాతినేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. పెళ్లి తర్వాత ఆమె నుంచి వస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ కావడంతో ఇండస్ట్రీలో దీనిపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్ బాధ్యతను కూడా లావణ్యే తన భుజాలపై వేసుకుని లీడ్ చేస్తోంది.

ఈ మూవీకి బజ్ పెంచేందుకు మెగా హీరోలు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు. ఇక త్వరలో జరగబోయే ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ఎవరైనా ఒక మెగా హీరోను చీఫ్ గెస్ట్‌గా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ రీసెంట్‌గా గాయపడి రెస్ట్ తీసుకుంటున్నాడు కాబట్టి, ఆయన ఈవెంట్‌కు రావడం దాదాపు కష్టమే.

దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లేదా స్వయంగా మెగాస్టార్ చిరంజీవిని ఈ ఫంక్షన్‌కు తీసుకురావాలని మూవీ టీమ్ గట్టిగా ట్రై చేస్తోంది.ఒకవేళ ‘సతీ లీలావతి’ బాక్సాఫీస్ దగ్గర హిట్ అయితే మాత్రం.. లావణ్యకు మరిన్ని లేడీ ఓరియెంటెడ్ కథలు క్యూ కట్టడం ఖాయం. కానీ అంతకంటే ముందు, మెగా కోడలిగా ఆమె ఫేస్ చేస్తున్న ఈ ఫస్ట్ సోలో స్టామినా టెస్ట్‌లో ఆడియన్స్ ఆమెకు ఏ మేరకు మార్కులు వేస్తారో చూడాలి.

సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus