Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘దసరా’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే..! ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి సొ సొ రెస్పాన్సే వచ్చినప్పటికీ.. దీనికి ముందు వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ మంచి హైప్ క్రియేట్ చేసింది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. తాజాగా డల్లాస్‌లో జరిగిన తన లైవ్ కాన్సెర్ట్‌లో ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశాడు అనిరుథ్.

Yeshanagula

‘యేష నాగుల'(Yeshanagula) అంటూ సాగే ఈ మాస్ సాంగ్.. ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అనిరుధ్ ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్, కాసర్ల శ్యామ్ సాహిత్యంలో రూపొందిన పక్కా నాటు పదాలు, జంగిరెడ్డి – ప్రభ..ల హుషారెత్తించే గాత్రం కలగలిపి ఈ పాటని ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలబెట్టింది. సోషల్ మీడియాలో ఈ పాటకి సంబంధించిన విజువల్సే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. విజువల్స్ పరంగా మాత్రం కొన్ని విమర్శలు ఎదుర్కొంటోంది ఈ పాట.

ముఖ్యంగా నాని డాన్స్ మూవ్మెంట్స్, ఎక్స్ప్రెషన్స్ వీక్ అంటున్నారు. కీర్తి సురేష్ మాత్రం చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసింది అంటున్నారు. మల్లెపూల దండతో కీర్తి సురేష్ గ్లామరస్ గా కూడా కనిపించింది. ఇదిలా ఉండగా..’ఏష నాగుల’ పాటకు కొరియోగ్రఫీ అందించిన ఆట సందీప్ ఈ పాట అవుట్‌పుట్ పై సందీప్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘పాట పూర్తయ్యాక నాని గారు నన్ను క్యారవాన్‌లోకి పిలిచి చాలా మెచ్చుకున్నారు.

రొటీన్ ఐటెం సాంగ్స్ లా కాకుండా ఇందులో ఒక కొత్త మ్యాజిక్ చేశావని, ఈ పాటకు నీకు కచ్చితంగా నేషనల్ అవార్డ్ వస్తుందని ఆయన పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు” అంటూ ఆట సందీప్ చెప్పడం జరిగింది.అయితే ఈ పాటలో నాని ఎనర్జీ లేకపోవడం, అదే మైనస్ అయినప్పుడు నేషనల్ అవార్డు వచ్చేంత స్కోప్ ఉంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus