సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీ అందరికీ కూడా మేనేజర్స్ ఉండడం సర్వసాధారణం ఇలా మేనేజర్ సెలబ్రిటీలకు సినిమా అవకాశాలు తీసుకురావడం నుంచి మొదలుకొని వారి బ్యాంకింగ్ అలాగే రెమ్యూనరేషన్ వంటి విషయాల గురించి కూడా అన్ని వ్యవహారాలను మేనేజర్స్ చక్కపరుస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్క సెలబ్రిటీకి కూడా మేనేజర్లు ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి సైతం పూజ దద్లాని మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈమె 2012వ సంవత్సరంలో షారుక్ ఖాన్ దగ్గర మేనేజర్ గా జాయిన్ అయ్యారు. ఇలా గత దశాబ్దార కాలంగా పాటు ఎంతో నమ్మకంగా మేనేజర్ గా వ్యవహరించడమే కాకుండా తన ఫ్యామిలీ ఫ్రెండ్ లా మారిపోయారు. ఈమె షారుఖ్ ఖాన్ కి మాత్రమే కాకుండా గౌరీ ఖాన్ కి కూడా చాలా ఆప్త మిత్రురాలు. గౌరీ ఖాన్ ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ఎంతో మంది సెలబ్రిటీల ఇళ్లకు ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేశారు.
ఇక పూజ (Pooja Dadlani) షారుక్ ఖాన్ తో మాత్రమే కాకుండా గౌరీ ఖాన్ అలాగే వీరి ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. ఈమె మేనేజర్ గా మాత్రమే కాకుండా షారుఖ్ ఖాన్ కి సంబంధించినటువంటి బిజినెస్ లను అలాగే ఆయన రెడ్ చిల్లీస్ బ్యానర్ వ్యవహారాలన్నింటిని కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇలా ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఈమె కష్టానికి తగ్గ ఫలితాన్ని రెమ్యూనరేషన్ రూపంలో షారుక్ అందిస్తున్నారు.
ఇక షారుక్ దగ్గర మేనేజర్ గా పనిచేస్తూ వారి విషయాలన్నింటినీ ఎంతో చక్కబెడుతున్నటువంటి పూజ ఏడాదికి సుమారు 9 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని తెలుస్తోంది. ఒక మేనేజర్ ఏడాదికి తొమ్మిది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు స్టార్ హీరోయిన్స్ కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోలేదు. షారుఖ్ ఖాన్ మేనేజర్ మాత్రం ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అంటే ఆ కుటుంబానికి ఆమె ఎంత ప్రత్యేకమో తెలుస్తోంది. ఇక ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన సమయంలో కూడా ఆయన బెయిల్ కి సంబంధించిన వ్యవహారాలన్నింటిని కూడా పూజ దగ్గరుండి చూసుకున్న సంగతి తెలిసిందే.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!