Vijay: విజయ్ సినిమాకి నో చెప్పిన ‘లవ్ టుడే’ బ్యూటీ..!

తమిళంలో రజనీకాంత్ తర్వాత.. కాదు రజినీకాంత్ తో సరిసమానంగా క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరో అంటే విజయ్ పేరే ఎక్కువగా చెబుతారు. తెలుగులో కూడా అతనికి మంచి మార్కెట్ ఉంది. సినిమా సినిమాకి విజయ్ మార్కెట్ పెరుగుతూనే వచ్చింది. అందులోనూ విజయ్ నటించిన గత సినిమాలు ‘మాస్టర్’ ‘వారసుడు’ ‘లియో’ వంటి సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధించాయి. ఇలాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తే ఏ హీరోయిన్ కాదు అనుకుంటుంది.

అలాంటి పెద్ద ఛాన్సులు రావడమే గొప్ప అనుకుంటారు. కానీ ఓ యంగ్ హీరోయిన్ మాత్రం విజయ్ వంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే సున్నితంగా తిరస్కరించిందట. ఆ బ్యూటీ మరెవరో కాదు.. ఇవానా..! ‘లవ్ టుడే’ చిత్రంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలో ఈమె నటనకి యూత్ ఫిదా అయిపోయారు. చిన్న వయసులోనే హీరోయిన్ అయిన ఈ బ్యూటీ.. తక్కువ టైంలోనే సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి.

అందువల్ల ఈమెకు పెద్ద సినిమాల్లో ఛాన్సులు లభిస్తున్నాయి. ఈ మధ్యనే ధోని నిర్మాణంలో ఓ సినిమా చేసింది. అలాగే తమిళంలో రూపొందుతున్న మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో కూడా నటిస్తుంది. తెలుగులో దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకు అయిన ఆశిష్ నటిస్తున్న ‘సెల్ఫిష్’ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.ఇలాంటి టైంలో ఈమెకు విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది గోట్’ సినిమాలో ఛాన్స్ వచ్చింది.

అయితే ఆమె నో చెప్పిందట. ఎందుకంటే ఈ సినిమాలో ఆమెకు చెల్లెలు పాత్ర ఆఫర్ చేశారట. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా స్థిరపడుతున్న టైంలో చెల్లి పాత్ర చేస్తే ప్రేక్షకులు మళ్ళీ ఆమెను హీరోయిన్ గా యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే ఉద్దేశంతో నో చెప్పినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. ఏదేమైనా విజయ్ (Vijay) సినిమాకి నో చెప్పడంతో ఇవానా వార్తల్లో నిలిచింది అని చెప్పాలి.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus