కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలంగా సీనియర్ మోస్ట్ హీరోల హవా అయితే చాలా వరకు తగ్గుతూ వస్తోంది. తమిళ ఇండస్ట్రీ అంటేనే మొదట అందరికీ ఎక్కువగా గుర్తుకు వచ్చేది రజనీకాంత్ అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత కమల్ హాసన్ సూర్య కార్తీ ఇలా పలువురు హీరోలు ఎక్కువగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండేవారు. కానీ వారి తర్వాత విజయ్ ఎక్కువగా డామినేట్ చేస్తున్నాడు అని చెప్పాలి.
ఇక తమిళంలో అయితే రజనీకాంత్ మార్కెట్ బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా అక్కడ విజయ్ కొనసాగుతున్నాడు. అతని ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో అతని పారితోషికం కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. విజయ్ బీస్ట్ సినిమా కోసం దాదాపు 80 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఆ తర్వాత వంశీ పైడిపల్లి దిల్ రాజు కలయికలో రాబోయే చిత్రానికి అంతకుమించి వంద కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
అందుకు దిల్ రాజు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ హీరోల తర్వాత అజిత్ కూడా అదే లిస్టులో చేరిపోయి నట్లు సమాచారం. రీసెంట్ గా వాలిమై సినిమా తో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అందుకున్న అజిత్ టోటల్ గా 200 కోట్ల వరకు ఆ సినిమాతో బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. అజిత్ తన మార్కెట్ పెరగడంతో రాబోయే సినిమా కోసం వంద కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
తన తదుపరి సినిమాను వినోథ్ దర్శకత్వంలో చేయబోతున్న అజిత్ కొత్త తరహా రెమ్యూనరేషన్ తో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక స్థాయిలో 150 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక వీరి తర్వాత విజయ్ అజిత్ నిలవడం విశేషం. చూస్తుంటే అజిత్ విజయ్ రాబోయే రోజుల్లో ప్రభాస్ తో సమానంగా సాలరీ అందుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?