RRR Facts: ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?

మరికొన్ని గంటల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విడుదల కాబోతుంది. అటు చరణ్ అభిమానులు ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క చిత్ర బృందం అంతా ప్రమోషన్లతో బిజీగా ఉంటే.. మరోపక్క ప్రేక్షకులంతా ‘ఆర్.ఆర్.ఆర్’ టికెట్లు బుక్ చేసే పనిలో శ్రమిస్తున్నారు. అంతేకాదు పాండమిక్ తో ఇబ్బంది పడుతున్న సినీ పరిశ్రమకి ‘ఆర్.ఆర్.ఆర్’ కొత్త ఊపుని తీసుకురావాలని దక్షణాది సినీ పరిశ్రమ అంతా కోరుకుంటుంది. ‘బాహుబలి’ రికార్డులని తలదన్నేలా ‘ఆర్.ఆర్.ఆర్’ కలెక్షన్లు ఉండబోతున్నాయి అని ట్రేడ్ సైతం కాన్ఫిడెంట్ గా ఉంది. ఇదిలా ఉండగా…రేపు మార్చి 25న విడుదల కాబోతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ఈ చిత్రానికి మొదటిగా అనుకున్న బడ్జెట్ రూ.300 కోట్లు.. కానీ ఫైనల్ గా రూ.500 కోట్లు అయ్యింది.

2) ఈ చిత్రానికి 3000 మంది టెక్నీకల్ డిపార్ట్మెంట్లో పనిచేసారు. అలాగే రాజమౌళి కింద 9మంది కో- డైరెక్టర్లు పనిచేసారు.

3) షూటింగ్ మొదలయ్యే ముందు 200 రోజులు ఆడిషన్స్ కు రిహార్సల్స్ కు స్క్రీన్ టెస్ట్ లకు కేటాయించారు.

4) ఈ చిత్రాన్ని 200 రోజుల్లో కంప్లీట్ చేయాలి అని షూటింగ్ కు ముందు అనుకున్నారు.. కానీ 300 రోజులు పట్టింది.

5) ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ లకు 75 రోజులు టైం పట్టింది.

6) ‘ఆర్.ఆర్.ఆర్’ లోని యాక్షన్ సన్నివేశాల కోసం లండన్ కు చెందిన 2500 మంది స్టంట్ మెన్ లు పనిచేసారు అలాగే విదేశాలకు చెందిన మరో 50మంది స్టంట్మెన్ లు పనిచేసారు.

7) ఇండియాలోనే కాకుండా 3 ఫారెన్ కంట్రీస్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ జరిగింది. రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్,వికారాబాద్ ఫారెస్ట్ , గుజరాత్ వంటి ప్రదేశాల్లోనే కాకుండా బల్గెరియా,నెథర్లాండ్, ఉక్రెయిన్ వంటి దేశాల్లో షూటింగ్ జరిగింది.

8) గండిపేట లోని 10 ఎకరాల స్థలంలో ఢిల్లీ సెట్ వేసి చరణ్, ఎన్టీఆర్ ల యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.

9) ఎన్టీఆర్ ఇంట్రో సీన్ ను బల్గెరియాలో చిత్రీకరించారు, రాంచరణ్ ఇంట్రో సీన్ ను హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు.

10) టైగర్ తో ఎన్టీఆర్ ఫైట్ సీన్ కోసం ‘మూవీ పిక్చర్ కంపెనీ’ అనే లండన్ కు చెందిన ఫేమస్ కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీని అప్రోచ్ అయ్యారు దర్శకుడు రాజమౌళి.

11) ఉక్రెయిన్ లోని ప్రెసిడెంట్ ప్యాలస్ లో నాటు నాటు సాంగ్ ను చిత్రీకరించారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus