తెలుగు సినిమా అంటే ఎంతో అభిమానం, తెలుగు చిత్ర పరిశ్రమపై అపారమైన ప్రేమతో అమెరికా నుంచి వచ్చి తన కలను నిజం చేసుకుంటున్న దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు. అమెరికాలో తన జాబ్ కొనసాగిస్తూనే, తెలుగు సినిమా రంగంపై ఉన్న మక్కువతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ'(Siddu Gadi Love Story) చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా అనేది ఆయనకు కేవలం వినోదం మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి మనసులో ఉన్న ఒక కల.
ఉద్యోగం ఒకవైపు, సినిమా మరోవైపు అయినప్పటికీ తన అభిరుచికి సమయం కేటాయిస్తూ, తెలుగు ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందించాలనే సంకల్పంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు సినిమా పట్ల తనకున్న అభిమానాన్ని మరచిపోకుండా, తన ఆలోచనలకు వెండితెర రూపం ఇవ్వాలనే లక్ష్యంతో దర్శకుడిగా అడుగులు వేస్తున్నారు.
తన ఆలోచనలు, అనుభవం, సృజనాత్మకతతో ప్రేక్షకులకు మంచి ప్రేమకథను అందించాలనే ప్రయత్నమే “సిద్ధుగాడి లవ్ స్టోరీ”. శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారిచెరుకూరు శివ బ్రహ్మిణి చెరుకూరు **సమర్పణలో, నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 27 న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలో హీరోగా మనోజ్ నటిస్తుండగా, హీరోయిన్లుగా శృతి, మోహన సిద్ధి నటిస్తున్నారు.
హీరో తండ్రి పాత్రలో సుమన్, విలన్ పాత్రలో సర్కార్ నటిస్తున్నారు. ప్రముఖ హాస్యనటులు చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ, “నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ తెలుగు సినిమా మీద ఉన్న ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు.
నా మనసులో ఉన్న సినిమా కలను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. ప్రేక్షకుల ఆదరణ, ఆశీస్సులతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను” అలాగే టీజర్ మంచి రెస్పాన్స్ రావడంతో చాలా సంతోషంగా ఉందని తెలిపారు.