Ashwini Sri: ‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

  • October 11, 2023 / 12:26 PM IST

‘బిగ్ బాస్ 7’ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. గడిచిన 5 వారాల్లో కిరణ్ రాథోడ్ , షకీలా, సింగర్ దామిని, రతిక, శుభశ్రీ , గౌతమ్ వంటి వారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అయితే ఊహించని విధంగా ఆదివారం ఎపిసోడ్ లో కొందరు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళే భోలే సావళి,పూజా, నయని పావని, అశ్విని శ్రీ, అర్జున్ అంబటి, పూజా మూర్తి వంటి వారు. వాళ్లలో ప్రేక్షకులకి తెలిసిన వారంటూ ఎక్కువ మంది లేరు. ఒక్క నయని పావని మాత్రమే అంతంత మాత్రంగా తెలుసు అని చెప్పుకోవాలి. ఇక అశ్విని శ్రీ కూడా తెలుగమ్మాయి అయినప్పటికీ.. ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యింది లేదు. కాబట్టి ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) 1989 జూలై 12 న ఈమె జన్మించింది. ఆమె పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. అవును హైదరాబాద్ కి చెందిన అమ్మాయే అశ్విని కావడం విశేషంగా చెప్పుకోవాలి.

2) అశ్విని విద్యాభ్యాసం కూడా హైదరాబాద్ లోనే జరిగింది. ఈమె సినీ పరిశ్రమకి రావాలని మొదట అనుకోలేదు.

3) కానీ కొంత కాలం తర్వాత ఈమెకు నటన పై వ్యామోహం పెరిగింది. అందుకోసం మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది.

4) కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ అలాగే ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లో నటించింది. అందువల్ల ఈమెకు పలు సినిమాల్లో ఛాన్స్ లు లభించాయి.

5) 2016 లో ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదట ‘వినోదం 100 పర్సెంట్’ అనే మూవీలో ఈమె నటించింది.

6) అటు తర్వాత 2017 లో వచ్చిన ‘అమీర్ పేటలో’, 2018 లో వచ్చిన ‘బి టెక్ బాబులు’ 2019 లో వచ్చిన ‘జయిక్కిరా కుదిరా’, 2020 లో వచ్చిన ‘నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్’ వంటి సినిమాల్లో నటించింది.

7) ఈమె ఇన్స్టాగ్రామ్ లో చేసే రీల్స్ కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అశ్విని శ్రీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 3 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

8) సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అవి వైరల్ అవుతూ ఉంటాయి.

9) అశ్విని శ్రీ చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. గ్లామర్ షో కి కూడా ముందుగానే ఉంటుంది. ఆల్రెడీ కొన్ని సినిమాల్లో నటించడం కూడా జరిగింది. కానీ ఈమె పాపులర్ కాలేదు.

10) అందుకే ‘బిగ్ బాస్ 7 ‘ ఆశ్రయించింది. కానీ బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు రెండు, మూడు వారాలకు మించి హౌస్ లో కొనసాగిన సందర్భాలు చాలా తక్కువ.

11) ఈ క్రమంలో (Ashwini Sri) అశ్విని శ్రీకి ‘బిగ్ బాస్ 7 ‘ ఎంత వరకు కలిసొస్తుంది?. ఆమె టాప్ 5 లో నిలుస్తుందా. హౌస్ నుండి బయటకు వచ్చాక ఈమెకు సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తాయా? అనేది చూడాలి..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus