Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Advertisement

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘తగ్గేదేలే’ అనే ఒక్క డైలాగ్ నుంచి శ్రీవల్లి డ్యాన్స్ స్టెప్స్ వరకు.. పుష్ప మేనియా నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ అయ్యింది.

Venu Madhav

అయితే, ఈ సినిమాలో బన్నీ చెప్పే ఓ డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. అదేంటంటే.. ‘నా కాలు మీద నా కాలేసుకున్న.. మీ ఓనర్ మీద ఏసినానా ఏందీ?’ అనేది ఆ డైలాగ్.

అయితే ఈ పవర్‌ఫుల్ యాటిట్యూడ్ డైలాగ్ వెనుక ఓ ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇది అసలు సుకుమార్ రాసిన డైలాగ్ కాదట. స్వర్గీయ కమెడియన్ వేణుమాధవ్(Venu Madhav) రియల్ లైఫ్‌లో చెప్పిన మాటలనే డైరెక్టర్ ఇలా సినిమాలో వాడేశారని ఇప్పుడు ఓ పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుమాధవ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఓసారి ఒక స్టార్ హీరో వేణుమాధవ్‌ను పిలిచి.. ‘ఏమయ్యా నువ్వు ఎవరి ఎదురైనా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావట కదా’ అని అడిగాడట. దానికి వేణుమాధవ్.. ‘నా కాలు మీద నేను కాలు వేసుకుంటే తప్పేంటి సార్.. పక్కోడి కాలు మీద వేస్తే కదా తప్పు’ అని ఏమాత్రం భయపడకుండా కౌంటర్ ఇచ్చారట. ఆ డైలాగ్‌తో ఆ హీరో కూడా రెండు నిమిషాలు షాక్ అయ్యి సైలెంట్ అయిపోయాడని వేణుమాధవ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇప్పుడు ఇదే వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. వాస్తవానికి సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో.. తన అన్నయ్య స్టైల్‌ను చూసే ఈ డైలాగ్ రాశానని చెప్పారు. కానీ, వేణుమాధవ్ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం.. ఆ రియల్ డైలాగ్‌నే సుకుమార్ ఇలా రీల్ డైలాగ్‌గా వాడేసుకున్నాడని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆ ఒక్క డైలాగ్ మాత్రం పుష్పరాజ్ యాటిట్యూడ్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది.

నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus