Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) .’గబ్బర్ సింగ్’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత రూపొందిన ఈ సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి.

Ustaad Bhagat Singh

‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చడం విశేషం.

ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ వంటివి పర్వాలేదు అనిపించాయి. ‘దేఖ్ లేంగే సాలా’ వంటి పాటలు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కానుంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.వారి టాక్ ప్రకారం చూసుకుంటే… సినిమా 2 గంటల 39 నిమిషాల నిడివి ఉందట.

పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ చిరంజీవి పాత సినిమాల్లోని పాటతో సింపుల్ గా ఉంటుందట. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది అంటున్నారు. లుంగీతో చేసే ఫైట్ సీన్ కూడా అభిమానులకి గూజ్ బంప్స్ తెప్పిస్తుంది అంటున్నారు. ఎత్తరా ఎత్తరా సాంగ్ లో పవన్ కళ్యాణ్ డాన్స్ మూమెంట్స్ అదిరిపోతాయట.మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి సాంగ్ కి కూడా పవన్ కళ్యాణ్ డాన్స్ చేసినట్టు చెబుతున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ , సెకండాఫ్ బాగున్నాయి అంటున్నారు. చూడాలి మరి మార్నింగ్ షోల నుండీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.

‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus