Ram Charan, Pawan Kalyan: చరణ్, పవన్ ఆ రికార్డులను క్రియేట్ చేస్తారా?

Advertisement

వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు ఖచ్చితంగా క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చరణ్, తారక్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా దాదాపుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ 120 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొనగా ఆర్ఆర్ఆర్ టార్గెట్ 1000 కోట్ల రూపాయలుగా

ఉంటే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో సాధించాల్సిన టార్గెట్ 200 కోట్ల రూపాయలుగా ఉంది. చరణ్ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవాలని భావిస్తుండగా ఆర్ఆర్ఆర్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. మరోవైపు పవన్ చాలా సంవత్సరాల తర్వాత సంక్రాంతికి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టాలీవుడ్ కు సంక్రాంతి బెస్ట్ సీజన్ కావడంతో ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వచ్చే నెలలో ఈ రెండు సినిమాల ట్రైలర్లు రిలీజ్ కానున్నాయి.

బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు సులభంగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సంక్రాంతి పోటీలో తెలుగు రాష్ట్రాల వరకు ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ మధ్య టఫ్ కాంపీటీషన్ ఉండే అవకాశం ఉంది. రాజమౌళి క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారని సమాచారం.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news