Prabhas: ఈ ఏడాది క్రిస్మస్ విన్నర్ ప్రభాస్ మూవీనే.. సాక్ష్యం ఇదేనంటూ?

  • September 29, 2023 / 05:45 PM IST

ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సమయంలో ఒకే రోజు సలార్, డుంకీ సినిమాలు పోటీ పడుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. సలర్ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి కూడా అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకోగా డుంకీ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే ఈ మూవీ క్లాస్ సినిమా కావడంతో సలార్ మూవీ పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేజీఎఫ్2 సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ మూవీ బుకింగ్స్ విషయంలో కూడా సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ తో పోటీ వల్ల డుంకీ సినిమా తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది. ప్రభాస్ ఫ్లాప్ సినిమాలు సైతం ఈ మధ్య కాలంలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించి ఇతర హీరోల అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

సలార్ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు కళ్లు చెదిరే రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. పోల్స్ లో ఎక్కువమంది సలార్ సినిమాకే ఓటేస్తున్నారు. సౌత్ లోనే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సలార్ సినిమాకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. సలార్ మూవీ రికార్డ్ స్థాయిలో స్క్రీన్లలో విడుదలయ్యేలా సలార్ మేకర్స్ అడుగులు వేస్తున్నారు.

సలార్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాల ఎంపిక విషయంలో స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సలార్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus