Skanda Review in Telugu: స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రామ్ (Hero)
  • శ్రీలీల (Heroine)
  • శరత్ లోహితస్వ, సాయి మంజ్రేకర్, ప్రిన్స్ తదితరులు.. (Cast)
  • బోయపాటి శ్రీను (Director)
  • శ్రీనివాసా చిట్టూరి - పవన్ కుమార్ (Producer)
  • ఎస్.తమన్ (Music)
  • సంతోష్ దిటాకే (Cinematography)
  • Release Date : సెప్టెంబర్ 28, 2023

“అఖండ” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మరో మాస్ మసాలా ఎంటర్ టైనర్ “స్కంద”. రామ్ పోతినేని కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం తొలుత సెప్టెంబర్ ప్రధమార్ధంలో విడుదలకు సన్నాహాలు చేసినప్పటికీ.. “సలార్” పోస్ట్ పోన్ తో లాంగ్ వీకెండ్ & పబ్లిక్ హాలీడేస్ కోసం సెప్టెంబర్ 28కి షిఫ్ట్ చేశారు. బోయపాటి మార్క్ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ & పాటలు మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!

కథ: రాష్ట్రంలోని ఓ బడా బిజినెస్ మ్యాన్ రుద్రకంటి రామకృష్ణరాజు (శ్రీకాంత్)ను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్నర్ చేసి.. అతడి కంపెనీని సొంతం చేసుకొని, ఎలక్షన్స్ కోసం కావాల్సిన డబ్బును ఆ కంపెనీ ద్వారా వైట్ గా మార్చడానికి మాస్టర్ ప్లాన్ వేస్తారు. కట్ చేస్తే.. రుద్రకంటి భాస్కర్ (రామ్) ఈ మాస్టర్ ప్లాన్ కి అడ్డం పడి.. అడ్డొచ్చిన వాళ్లందర్నీ చెడుగుడాడేసి రామకృష్ణరాజు & ఫ్యామిలీని సేఫ్ గా ఎలా బయటకు తీసుకొచ్చాడు? అనేది “స్కంద” కథాంశం.

నటీనటుల పనితీరు: బోయపాటి డిజైన్ చేసిన మాస్ క్యారెక్టర్ లో రామ్ కాస్త ఇబ్బందిపడినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ యాసలో మాస్ డైలాగ్స్ చెప్పడానికి చాలా కష్టపడ్డాడు కూడా. కానీ.. మాస్ యాక్షన్ సీన్స్ లో మాత్రం రఫ్ఫాడించేశాడు. మాంచి బీహారీ హీరోను చూస్తున్న ఫీల్ కలుగుతుంది అతడి స్టైలింగ్ & బాడీ లాంగ్వేజ్. శ్రీలీల స్క్రీన్ ప్రెజన్స్ & క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమీ లేదు కానీ డ్యాన్స్ మాత్రం ఇరగదీసింది.

ముఖ్యంగా పబ్ సెట్ లో వేసిన పోల్ డ్యాన్స్ ఆడియన్స్ కు మంచి కిక్ ఇస్తుంది. సాయి మంజ్రేకర్ మరీ సైడ్ క్యారెక్టర్ లా మిగిలిపోయింది. శ్రీకాంత్ మాత్రం తనకు ఇచ్చిన బాధ్యతాయుతమైన పాత్రకు న్యాయం చేశాడు. అలాగే.. మహారాష్ట్ర నటుడు అజయ్ పుర్కార్, కన్నడ నటుడు శరత్ లోహితస్వలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇమడడానికి విశ్వప్రయత్నం చేశారు. మిగతా నటీనటులందరూ.. బోయపాటి పెట్టిన ఫ్రేమ్ లో నిండిపోయి న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ఫస్టాఫ్ అయ్యేవరకూ అసలు కథ ఏమిటి? అనేది సదరు ప్రేక్షకుడికి అర్ధం కాకుండా, అసలు కథ గురించి పట్టించుకోకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు బోయపాటి. ఆడియన్స్ కాస్త డీవియేట్ అయ్యి ఫోన్లు జేబుల్లోంచి తీస్తున్నారు అని డౌట్ వచ్చినప్పుడల్లా.. ఒక ఫైట్ సీన్ & క్యారెక్టర్స్ ఫేసుల మీద ఫుల్ స్పీడ్ బ్లోయర్స్ పెట్టి సినిమాను లాగించేశాడు. ఇక యాక్షన్ సీన్స్ అయితే.. బీహారీ & భోజపురి సినిమాలను తలపిస్తాయి.

ముఖ్యంగా రెండో రామ్ చేసే రెండు పోరాటాలు అతి అనే పదం కూడా ఆవళించేలా చేశాడు బోయపాటి. దర్శకుడిగా బోయపాటి మార్క్ అనేది బాలయ్యకు మాత్రమే సింక్ అయ్యింది, కొద్దో గొప్పో అల్లు అర్జున్ మ్యానేజ్ చేశాడు కానీ.. మిగతా హీరోలు ఆ స్థాయి సెన్స్ లెస్ మాస్ ను హ్యాండిల్ చేయలేరు అని మరోసారి రుజువైంది.

సినిమాటోగ్రాఫర్ సంతోష్ ఫ్రేమ్స్ & యాక్షన్ బ్లాక్స్ ను పిక్చరైజ్ చేసిన ఫార్మాట్ బాగుంది. మాస్ & బి,సి సెంటర్ ఆడియన్స్ కు ఆకట్టుకొనే స్థాయిలో ఉన్నాయి. అలాగే.. పాటల్ని చాలా స్టైలిష్ గా చిత్రీకరించాడు. తమన్ ఎప్పట్లానే పాటల్లో తుస్సుమనిపించినా.. నేపధ్య సంగీతం విషయంలో మాత్రం తన బాదుడు తాను బాదుకుంటూ పోయాడు. ప్రొడక్షన్ డిజైన్ & గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తపడ్డారు. నిర్మాత ఎక్కడా రాజీపడలేదు అని అవి చూస్తే అర్ధమైపోతుంది.

విశ్లేషణ: కథ-కథనం-లాజిక్కులు-ఫిజిక్స్ గట్రాలు పట్టించుకోకుండా.. కేవలం బోయపాటి ఊరమాస్ ఫైట్స్ ను ఎంజాయ్ చేయగలిగే ప్రేక్షకులు మాత్రమే చూడదగ్గ చిత్రం (Skanda )”స్కంద”. ఎలాగూ జనం అది ఎక్స్ పెక్ట్ చేసే వస్తారు కాబట్టి.. మాస్ సెంటర్స్ లో ఈ వారాంతం వరకూ సినిమా ఆడేస్తది. కాకపోతే.. ఎమోషన్స్ సరిగా పండకపోవడం, రామ్ మినహా మరో క్యారెక్టర్ ఏదీ ఎలివేట్ అవ్వకపోవడం వల్ల సినిమా లాంగ్ రన్ కాస్త కష్టం.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus