Prince Yawar: ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

‘బిగ్ బాస్ సీజన్ 7 ‘ సెప్టెంబర్ 3 న ఆదివారం నాడు ప్రారంభమైంది. బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా సక్సెస్ అయ్యింది. ఈ షోకి ఫ్యాన్స్ కూడా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అయితే ఈ సీజన్ కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. ప్రతి సీజన్లో 16 మంది కంటెస్టెంట్లు పాల్గొనే వారు. ఈ సీజన్లో మాత్రం హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారం లేదా రెండో వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండే అవకాశం ఉంది. ఈ సీజన్ ను కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ సీజన్ కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. అందుకే ఉల్టాపల్టా అంటూ ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది ముందుగానే హింట్ ఇచ్చింది ‘బిగ్ బాస్’ యూనిట్. ఇదిలా ఉండగా.. ఈ సీజన్లో ప్రేక్షకులకి తెలిసిన కంటెస్టెంట్లు తక్కువ మందే ఎంట్రీ ఇచ్చారు.ఎక్కువ శాతం తెలీని కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు.

ఈ సీజన్లో 4 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్ యవార్. ప్రతి సీజన్లో ఓ మోడల్ ఎంట్రీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సీజన్ కి ఇతన్ని పట్టుకొచ్చారు. సిక్స్ ప్యాక్ బాడీతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి :

1) 1996 వ సంవత్సరంలో హైదరాబాద్, తెలంగాణాలో ఇతను జన్మించాడు. విద్యాబ్యాసం కూడా ఇక్కడే జరిగింది. అయితే పీజీ మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో పూర్తిచేశాడు.

2) ప్రిన్స్ యవార్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. అతనికి అన్నీ అతని అన్న వసీం అహ్మద్ అనే చెప్పాలి. అతను ఒక రచయిత.

3) 2022 లో వచ్చిన ‘కమిట్మెంట్’ అనే సినిమాతో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు అన్వేషి జైన్, తేజస్వి మాదివాడ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.

4) అంతకు ముందు ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈటీవీలో ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యేది. అందులో శాండీ అనే పాత్రలో చాలా బాగా నటించేవాడు.

5) అటు తర్వాత ‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అయ్యే ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే సీరియల్ లో కూడా ఇతను నటించాడు.

6) అలాగే జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యే హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో కూడా నటించాడు. ‘అభిషేకం’ అనే సీరియల్ లో కూడా నటించాడు.

7) ప్రిన్స్ యవార్ పలు యాడ్స్ లో కూడా నటించాడు.

8) చిన్నప్పటి నుండి ఇతనికి నటనపై ఆసక్తి ఎక్కువ అందుకే.. చదువుకునే రోజుల నుండి ప్రొడక్షన్లో పనిచేస్తూ వచ్చాడు.

9) ఇతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో ఎక్కువగా క్రికెట్ ఆడుతూ ఉంటాడు ప్రిన్స్ యవార్

10) అలాగే జిమ్ లో వర్కౌట్లు చేసే వీడియోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాడు.

11) సీరియల్స్ లో, సినిమాల్లో నటించినప్పటికీ.. ఇతనికి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ‘బిగ్ బాస్ 7 ‘ తో ఆ లోటు తీరుతుంది అనే ఆశతో ఇతను (Prince Yawar) ఉన్నట్టు తెలుస్తుంది.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus