బాలయ్య భవిష్యత్ ప్రాజెక్ట్స్ వారి కథలతోనే?

  • October 2, 2020 / 12:14 PM IST

నందమూరి నట సింహం బాలయ్యకు ఓ భారీ హిట్ కావాలి. బాలయ్య ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా కాలమే అయిపోతుంది. 2019 బాలయ్యకు పీడకలగా మిగిలింది. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ఎన్టీఆర్ బయోపిక్స్ తో పాటు రూలర్ మూవీ కనీస వసూళ్లు దక్కించుకోలేక పోయాయి. దీనితో బాలయ్య ఎంతో ఆలోచించి అచ్చొచ్చిన బోయపాటి శ్రీనుతో మూవీ కమిటయ్యారు. ఈ మూవీ పై అటు ఫ్యాన్స్ తో పాటు సినిమా వర్గాలలో భారీ అంచనాలున్నాయి.

బాలయ్య పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఇక బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో దర్శనం ఇస్తాడని తెలుస్తుండగా, వాటిలో ఒకటి అఘోర కావడం విశేషం. ఐతే బాలయ్య ఈ చిత్రం తరువాత లైన్ అప్ లో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టారని తెలుస్తుంది. ముగ్గురు స్టార్ రైటర్స్ రాసిన కథలు బాలయ్య కోసం సిద్ధంగా ఉన్నాయట. టాలీవుడ్ సీనియర్ రైటర్స్ ద్వయం పరుచూరి బ్రదర్స్ బాలయ్య కోసం ఓ కథ రాశారట.

ఓ పవర్ సబ్జెట్ తో సిద్దమైన ఆ కథ బాలయ్యకు బాగా నచ్చేసిందట. అలాగే టాలీవుడ్ లో ఫార్మ్ లో కొనసాగుతున్న రచయిత సాయి మాధవ్ బుర్రా కూడా బాలయ్య కోసం ఓ కథ రాశారట. అలాగే మరో స్టార్ రైటర్ కోనా వెంకట్ సైతం బాలయ్య కోసం కథ సిద్ధం చేశారట. భవిష్యత్తులో బాలయ్య చేసే చిత్రాలు ఈ ముగ్గురు రచయితల కథలతో ఉంటాయని టాలీవుడ్ టాక్.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus