బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!

  • September 29, 2020 / 06:07 PM IST

బిగ్‌బాస్‌ సీజన్‌ మారింది… కంటెస్టంట్లు మారిపోయారు… హౌస్‌ సెట్‌ మారింది… హౌస్‌ ప్లేస్‌,డిజైన్‌ కూడా ఛేంజ్‌ అయింది… ఆఖరికి హోస్ట్‌ కూడా మారాడు.. అయితే ఇప్పటికీ మారని అంశం బిగ్‌బాస్‌ వాయిస్‌. బిగ్‌బాస్‌ షోలో ఆకట్టుకునే అతి ముఖ్యమైన అంశాల్లో బిగ్‌బాస్‌ వాయిస్‌ ఒకటి అనడంతో అతిశయోక్తి లేదు. బిగ్‌బాస్‌ ఎవరో ఎవరికీ తెలియదు. కానీ బిగ్‌బాస్‌ ఎవరు, కేవలం వాయిస్‌ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. గంభీరంగా ఉండే ఆ స్వరం కొన్ని సార్లు గగుర్పాటుకు కూడా గురి చేస్తుంటుంది. ‘బిగ్‌బాస్‌ కోరిక మేరకు…’ అంటూ వచ్చే ఆ వాయిస్‌ మీకూ నచ్చే ఉంటుంది. మరి ఆ వాయిస్‌ ఎవరిది? దానికి సమాధానం మేం చెబుతున్నాం.

బిగ్‌బాస్‌ సీజన్‌ మొదలైనప్పటి నుంచి వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నది ఓ సీనియర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌. వివిద సినిమాలు, సీరియల్స్‌, ప్రకటనలకు డబ్బింగ్‌ చెప్పిన ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రాధాకృష్ణనే ‘వాయిస్‌ బిగ్‌బాస్‌’. నాలుగు సీజన్లుగా ఆయన వాయిస్‌లోనే మనం బిగ్‌బాస్‌ చూస్తున్నాం. తొలి సీజన్‌ మొదలయ్యే ముందు షో నిర్వాహకులు దాదాపు 100 మంది గొంతులను పరీక్షించారు. ఆఖరికి రాధాకృష్ణ గొంత సరిపోతుందని నిర్ణయానికి వచ్చారు. బిగ్‌బాస్‌ అంటూ రాధాకృష్ణ మాట్లాడే మాటల్లో కనిపించే గాంభీర్యం బాగా నచ్చి అతనిని ఎంపిక చేసుకున్నారని భోగట్టా.

ఇంటి సభ్యులు ఏం చేయాలనుకున్నా.. చేయకూడదన్నా అన్నీ బిగ్ బాస్ చూసుకుంటాడు. కనిపించకుండా వినిపిస్తుంటాడు ఈయన. తొలి రెండు సీజన్లలో ఒకే తరహా గొంతును వినిపించిన రాధాకృష్ణ …. ఆ తర్వాత మూడో సీజన్‌కు వచ్చేసరికి కాస్త మార్పు చేశాడు. ఇప్పుడు నాలుగో సీజన్‌లోనూ కొత్త స్టయిల్‌ను కొనసాగిస్తున్నాడు. రాధాకృష్న గతంలో సిఐడి లాంటి డబ్బింగ్‌ సీరియల్‌కు డబ్బింగ్ చెప్పాడు. అయితే ఈ విషయంలో ఎక్కడా అధికారిక ప్రకటన రాలేదు. రాధాకృష్ణ కూడా ఎవరికీ ఈ షో గురించి మాట్లాడరు.

‘బిగ్‌బాస్‌’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus