కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

ఒకప్పుడు ఇండియాలో బాలీవుడ్ తరువాత కోలీవుడ్ ఇండస్ట్రీనే పెద్దది అనే వారు. మార్కెట్ పరంగా హిందీ సినిమాల తరువాత ఆ స్థాయిలో తమిళ సినిమాలే వసూళ్లను రాబడుతూ ఉండేవి. అయితే ‘బాహుబలి'(సిరీస్) తరువాత తెలుగు సినిమాల మార్కెట్ కూడా పెరగడంతో కోలీవుడ్ మనకంటే వెనుక పడింది అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే తమిళ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆధరణ దక్కుతుండడం మనం ఎప్పటి నుండో చూస్తూనే వస్తున్నాం. ఇక తమిళ్ లో హీరోలకు ఫ్యాన్స్ కాదు ఏకంగా భక్తులే ఉంటారని చెప్పాలి. అక్కడి జనాలు ఓ హీరో పై అభిమానం పెంచుకుంటే.. ఎప్పటికీ ఆ అభిమానాన్ని చూపిస్తూనే ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. క్రేజ్ పరంగానే కాదు పారితోషికాల పరంగా కూడా తమిళ్ హీరోలు ముందు వరుసలోనే ఉంటారు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే టాప్ 15 హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) రజినీ కాంత్ : 60 కోట్ల నుండీ 70 కోట్లు

2) విజయ్ : 50 కోట్ల నుండీ 55 కోట్లు

3)అజిత్ : 40 కోట్లు

4) కమల్ హాసన్ : 28 కోట్లు

5) సూర్య : 25 కోట్లు

6) ధనుష్ : 15 కోట్లు

7)విక్రమ్ 9 కోట్ల నుండీ 10 కోట్లు

8) విజయ్ సేతుపతి : 8 కోట్లు

9)కార్తీ : 7 కోట్లు

10) శివ కార్తికేయన్ : 6 కోట్ల నుండీ 7 కోట్లు (సినిమా బడ్జెట్ ను బట్టి)

11) జయం రవి : 6 కోట్లు

12)మాధవన్ : 5 కోట్లు

13) శింబు : 5 కోట్లు

14)విశాల్ : 4 కోట్లు

15)సిద్దార్థ్ : 2 కోట్ల నుండీ 3కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus