’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ 6 డేస్ కలెక్షన్స్..?

  • February 4, 2021 / 11:52 AM IST

బుల్లితెర పై స్టార్ యాంకర్ గా రాణిస్తూ వస్తోన్న ప్రదీప్.. హీరోగా మారుతూ చేసిన చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు మున్నా దూలిపుడి డైరెక్ట్ చేసాడు. ‘ఎస్వీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్వీ.బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.అనూప్ రూబెన్స్ సంగీతంలో రూపొందిన ‘నీలి నీలి ఆకాశం’ అనే ఒక్క పాటతో ఈ సినిమాకి భారీ హైప్ ఏర్పడింది. ఇక ‘జి.ఏ2.పిక్చర్స్’ ‘యూ.వీ. క్రియేషన్స్’ వంటి బడా నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ముందుకు రావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయనే చెప్పొచ్చు.దాంతో జనవరి 29న విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. మంచి కలెక్షన్లను రాబట్టి 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసింది.

ఇప్పటికీ మంచి కలెక్షన్లను రాబడుతూనే ఉంది. ఇక ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం   1.93 cr
సీడెడ్   1.17 cr
ఉత్తరాంధ్ర   0.75 cr
ఈస్ట్   0.45 cr
వెస్ట్   0.37 cr
కృష్ణా   0.42 cr
గుంటూరు   0.50 cr
నెల్లూరు   0.28 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   5.87 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.18 cr
ఓవర్సీస్   0.18 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   6.23 cr

’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రానికి 4.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా …ఆ టార్గెట్ ను 4 రోజుల్లోనే కంప్లీట్ చేసింది.ఇక 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 6.23 కోట్ల షేర్ ను రాబట్టింది. బుధవారం రోజున కూడా ఈ చిత్రం 0.38 కోట్ల షేర్ ను రాబట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం.

Click Here To Read Movie Review

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus