పాత సినిమాల్లో అయితే విలన్ ఎంత చెడ్డవాడు అయినప్పటికీ ఆ విలన్ భార్య మాత్రం చాలా మంచిదై ఉంటుంది. ఆ విలన్ మోసాలను, అక్రమాలను చివరికి తానే బయట పెట్టాలని ట్రై చేసి ప్రాణాలు కోల్పోతూ ఉంటుంది. అయితే అటు తరువాత కాస్త ట్రెండ్ మారింది. విలన్ తో పాటు విలన్ భార్య కూడా ఓ రేంజ్లో రెచ్చిపోయి విలనిజం చూపించడం.. లేదా చాలా సున్నితంగా కనిపిస్తూనే మనుషుల్ని చంపించడం వంటివి మనం చూస్తూ వచ్చాం. ఇక ఈ మధ్య కాలంలో అయితే విలన్ తో సమానంగా విలన్ భార్యలు విలనిజం చూపించడం అలాగే.. ఆ విలనిజం చూపించడం లేదా మనుషుల్ని చంపించడం వెనుక .. విలన్ పై వారు బోలెడంత ప్రేమను చూపించడం.. అనేది అబ్బో వేరే లెవల్ అన్నయ్య అది. హీరో,హీరోయిన్ల జోడీల కంటే వీళ్ళ జోడీ లకే బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని .. భయపెట్టిన ఆ విలన్ జోడీలు మరియు ఆ సినిమాల పేర్లను ఓ లుక్కేద్దాం రండి :
1) జయమ్మ – కటారి కృష్ణ :
క్రాక్ మూవీలో ఈ జంట చూపించిన విలనిజం అంతా ఇంతా కాదు. వీళ్ళ విలనిజానికి పెద్ద నమస్కారం పెట్టాలి.
2) బాల – ఆండాళ్లు :
అర్జున్ మూవీలో పైకి దేవుళ్ళ మాదిరి బిల్డప్ ఇస్తూనే .. మరోవైపు వారి రాక్షసత్వాన్ని చూపించారు ఈ జంట.
3) బిట్టు – దేవయాని :
అబ్బో జులాయి సినిమాలో ఈ జంటకు ఉన్న అండర్స్టాండింగ్, హీరో – హీరోయిన్లకు కూడా ఉండదు.
4) సర్పంచ్ – సర్పంచ్ గారి పెళ్ళాం :
నేనే రాజు నేనే మంత్రి సినిమాలో వీళ్ళ కాంబో కి జనాలు తెగ భయపడిపోయారు.
5) ఎం.ఎల్. ఎ – ఎం.ఎల్. ఎ భార్య :
స్టాలిన్ సినిమాలో ప్రదీప్ రావత్ మరియు రవళి జంట విలనిజం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందమ్మ.
6) రోహిత్ – స్వప్న :
ఈ సినిమాలో కూడా హీరో,హీరోయిన్ల కంటే కూడా ఈ విలన్ జోడీకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది.
7) కోట – జయమాలిని :
ఈ సినిమాలో హీరో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీని ముప్పుతిప్పలు పెట్టేస్తుంది ఈ విలన్ జంట. చాలా అంటే చాలా స్పైసీ అమ్మ.
8) బాబు మోహన్ – వడ్డి వుక్కరిసి :
అమ్మోరు సినిమాలో ఈ జంట చూపించే విలనిజం కూడా వేరే లెవల్. ఆ పక్క కామెడీ కూడా అందిస్తూనే.. మర్డర్ ప్లాన్ లు వెయ్యడం అవి బురిడీ కొట్టడం మనల్ని ఆకట్టుకునేలా చేస్తాయి.
9) దేవుడు – మల్లి :
నిజం సినిమాలోని ఈ కాంబో కి కూడా సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి. ఇది కూడా చాలా అంటే చాలా స్పైసీ.
10) రాజీవ్ కనకాల – సత్య కృష్ణ :
రోహిత్ అండ్ స్వప్న ల ట్రాక్ … వీళ్ళ నుండే తీసుకున్నారేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. రక్ష సినిమాలో వీళ్ళ ట్రాక్ కూడా హైలెట్ అని చెప్పొచ్చు.