’30 ఇయర్స్ ఇక్కడ’ అనే డైలాగ్ తో కడుపుబ్బా నవ్వించి.. ఆ డైలాగ్ నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు పృథ్వీ రాజ్. నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే ఈ నటుడు.. తాజాగా హాస్పిటల్ పాలవ్వడం కలకలం రేపింది. సడన్ గా ఇతను అనారోగ్యం పాలవ్వడంతో… హాస్పిటల్ లో చేర్పించారు కుటుంబ సభ్యులు. దీంతో నటీనటులు, పృథ్వీని అభిమానించేవారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో పృథ్వీ సెలైన్ పెట్టించుకుని మరీ .. బెడ్ పైనుంచే ఒక చిన్న వీడియోని రిలీజ్ చేశాడు.
పృథ్వీ మాట్లాడుతూ.. ” దర్శకుడిగా మారి మొదటిసారి ఓ సినిమా తీయబోతున్నాను. ‘కొత్త రంగుల ప్రపంచం’ సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలి. 26న పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశాం. కానీ ఇంతలో ఇలా అయ్యింది. ఇలా అనారోగ్యంతో హాస్పిటల్ బెడ్ పై ఉన్నా కానీ సినిమా గురించే ఆలోచిస్తున్నాను. మా కొత్త రంగుల ప్రపంచం సినిమాకి, మా టీమ్ కి మీ అందరి సపోర్ట్ కావాలి” అంటూ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.
కానీ (Prudhvi Raj) పృథ్వీ ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్ లో చేరాడు అనేది మాత్రం చెప్పలేదు. ఈ క్రమంలో ఎవరికీ తోచింది వారు అనుకుంటున్నారు. ‘ఇది షూటింగ్లో భాగంగా చేసిన వీడియోనా?’ లేక ‘పబ్లిసిటీ స్టంట్ అయ్యుంటుందా?’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ అసలు విషయం ఏంటో తెలీకుండా నెగిటివ్ కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. 30 ఇయర్స్ పృథ్వీ హెల్త్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#30YearsIndustry #Pruthviraj #hospitalized #Tollywood pic.twitter.com/UbnZfYJBP0
— Tirumalasetty Tirupathirao (@tiru9676) May 9, 2023
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?