Stars: ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

పెద్దోడైనా..చిన్నోడైనా పోరపాట్లు జరుగుతూ ఉంటాయి..వాటిని కామెంట్స్ చేస్తూ ఉంటారు.. ఈ సోషలిజంలో ఏవరైనా చిన్న పోరపాటు చేశాడా.. వాళ్ల పని అయిపోయినట్లే.. సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో నెటిజన్స్ ఏదో ఒక సెలబ్రిటీపై ట్రోలింగ్స్ చేస్తూనే ఉంటారు.చిన్న హీరోల నుంచి పెద్ద హీరో హీరోయిన్ ల వరకు ప్రతి ఒక్కరిపై ఏదో ఒక సమయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా నెట్టింట సెలెబ్రెటీల ఇంగ్లీష్ యాక్సెంట్ పై ట్రోల్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం సినిమాలకు సరిహద్దులు చెరిగిపోయాయి. ప్రాంతీయ హద్దులను దాటి గ్లోబల్ లెవెల్ లో మన స్టార్లు వెలుగుతున్నారు. అయితే మన (Stars) స్టార్లు “రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌గా ఉండండి” అన్నట్టుగా ఇతర దేశాలకు వెళ్ళినపుడు అక్కడి యాక్సెంట్ ని అనుకరించడం వల్ల ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

ఐశ్వర్య రాయ్

ప్రపంచ మాజీ సుందరి, ఆల్ టైం బ్యూటీ ఐష్ కేన్స్ రెడ్ కార్పెట్‌ పై ప్రెస్‌తో ఇంటరాక్ట్ అయినపుడు ఆమె కూడా యాక్సెంట్ ని ఫేక్ చేసారంటూ విమర్శలు వచ్చాయి.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా ఆమె వరుసగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో సినిమాలు చేస్తుంటారు. అయితే అక్కడ పలు ఇంటర్వ్యూ లు ఇచ్చిన సమయం లో యాక్సెంట్ ని ఫేక్ చేసారంటూ విమర్శలు వచ్చాయి.

రామ్ చరణ్

ఆర్. ఆర్.ఆర్ ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం విదేశాలకు వెళ్ళినపుడు రామ్ చరణ్ పలు మీడియాలకు ఇంటర్వ్యూ లు ఇచ్చినపుడు చరణ్ యాక్సెంట్ పై కూడా ట్రోల్స్ వచ్చాయి.

ఎన్టీఆర్

ఎన్టీఆర్ పై కూడా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సమయం లో ఫేక్ యాక్సెంట్ వాడారని విపరీతం గా ట్రోల్స్ ఎదుర్కొన్నారు.

అనిల్ కపూర్

స్లం డాగ్ మిలియనీర్ మూవీ రిలీజ్ సమయం లో కూడా అనిల్ కపూర్ యాక్సెంట్ పై విమర్శలు వచ్చాయి.

సమంత

అమెరికన్ టీవీ సిరీస్ ‘సిటాడెల్’ ప్రీమియర్ షో కోసం నటి సమంత లండన్ వెళ్లారు. లండన్‌లో షో చూసిన తర్వాత సమంత మీడియాతో మాట్లాడారు. అయితే ఆ సమయం లో సామ్ ఇంగ్లీష్ యాక్సెంట్ పై ట్రోల్స్ వచ్చాయి. 7

కరీనా కపూర్

రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌ కి హాజరైన కరీనా కపూర్ కూడా అక్కడ తన యాక్సెంట్ ని ఫేక్ చెయ్యడం తో ట్రోల్స్ వచ్చాయి. ఇంగ్లీష్ లో మాట్లాడుతూ.. ట్రోల్స్ అయిన వారు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus