మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ ని ‘సితార నాగవంశీ’ కొనుగోలు చేశారు. మొదట బాలయ్య- రవితేజ కాంబినేషన్లో చేయాలని అనుకున్నారు. తర్వాత బాలయ్య- రానా వరకు వచ్చింది. ఒక దశలో ఈ కాంబో ఫిక్స్ అనుకున్నారు. కానీ బాలయ్య తప్పుకోవడం పవన్ కళ్యాణ్ వచ్చి చేరడం జరిగింది.’భీమ్లా నాయక్’గా(Bheemla Nayak) అది రూపొందింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ రచనా సహకారం అందించారు.
ఒరిజినల్ తో పోలిస్తే తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు. 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కోవిడ్ మళ్ళీ ఎటాక్ చేయడంతో జనాలు ధియేటర్లకి రావడం మళ్ళీ తగ్గించారు. పైగా అప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీతో ధియేటర్లు నడుపుతున్నారు. దీంతో ‘భీమ్లా నాయక్’ రిలీజ్ వాయిదా వేశారు. ఫైనల్ గా 2022 ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ ని రిలీజ్ చేశారు.
ఈ సినిమా రిలీజ్ టైమ్లో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వకపోగా.. అప్పుడున్న రేట్లు బాగా తగ్గించేసింది. పైగా ఎక్కడైనా ఎక్కువ రేట్లకి అమ్ముతారేమో అని భావించి.. ధియేటర్ల వద్ద పోలీసులను, సీఆర్ పి ఎఫ్ సిబ్బందిని కాపలాగా పెట్టింది. ఓ పక్క అన్ సీజన్.. మరో వైపు తక్కువ టికెట్ రేట్లు.. అయినప్పటికీ ‘భీమ్లా నాయక్’ కి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేసింది. దాదాపు రూ.92 కోట్ల వరకు షేర్ ని రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.155 కోట్లకి పైగా గ్రాస్ ను కొల్లగొట్టింది.
సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యి.. అలాగే టికెట్ రేట్లు అనుకూలంగా ఉండుంటే.. ‘భీమ్లా నాయక్’ కచ్చితంగా బ్రేక్ ఈవెన్ సాధించి భారీ లాభాలు అందించేదేమో. నేటితో ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యి అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘భీమ్లా నాయక్’ ఓ అరుదైన రికార్డుని సృష్టించింది. 4 ఏళ్ళుగా ఈ రికార్డుని మరో సినిమా బ్రేక్ చేయలేదు.