Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ హీరో ప్రిన్స్ (Prince Cecil) అందరికీ సుపరిచితుడే. ‘బస్టాప్’ సినిమాతో హీరోగా మంచి పాపులారిటీ పొందాడు. అంతకు ముందు తేజ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రొమాన్స్ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ అంతకు మించి రాణించలేకపోయాడు. కొన్నాళ్ళకి బిగ్ బాస్ సీజన్ 1 లో పార్టిసిపేట్ చేశాడు. అక్కడ తన గేమ్ తో మెప్పించాడు. కానీ అది కూడా ఇతని కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు.

Prince Cecil Weds Sai Machiraju

డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ , స్కంద వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు. అవీ కలిసి రాలేదు. కానీ ఏదొక ఆఫర్ పడుతూ సినిమాల్లో కనిపిస్తున్నాడు. అయితే సడన్ గా ఇతను పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్ మొదలైంది. వివరాల్లోకి వెళితే… తన ప్రియురాలు, ఎన్ఆర్ఐ అయినటువంటి సాయి మాచిరాజుతో త్వరలో ఏడు అడుగులు వేయబోతున్నాడు. ప్రిన్స్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నాడు. ‘ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లి వేడుకలో ఈ జంట కలుసుకున్నారట. వీరి మధ్య ముందుగా మాటలు కలిశాయట. తర్వాత ఆ పరిచయం క్రమంగా బలమైన స్నేహానికి దారి తీసింది.

ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమలో పడ్డారట. కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ జంట, ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఆగస్టు 24న న్యూజిలాండ్ వేదికగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది మిత్రుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని ప్రిన్స్ కన్ఫర్మ్ చేశాడు. ఈ పోస్ట్ కొద్దిసేపటికే వైరల్ గా మారింది. ప్రిన్స్ (Prince Cecil) ఫాలోవర్స్ అంతా ఇతనికి ఆల్ బెస్ట్ అంటూ తమ బెస్ట్ విషెస్ ను తెలియపరుస్తున్నారు.

 వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

 

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus