దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వడానికి ఆయన బ్రాండ్ ఒక కారణం అయితే ప్రమోషన్ మరొక ఆయుధం అని చెప్పవచ్చు. ఎలాంటి సినిమాకైనా సరే కంటెంట్ జనాలను ఆకర్షించేలా హైలెట్ చేస్తుంటారు. ఇక ప్రస్తుతం అందరి చూపు RRR ప్రమోషన్ పై కూడా అంచనాలు గట్టిగానే పెంచేసుకున్నారు. జక్కన్న కూడా అంచనాలకు తగ్గట్లుగా హై లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నాడు.సినిమా ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసేలా ఒక కాస్ట్లీ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.
అది కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఒకేసారి జక్కన్న అందులో 5 మంది స్టార్స్ ను చూపిస్తాడట. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ప్రభాస్, రానా దగ్గుబాటి, రవితేజ వంటి స్టార్స్ ఆ సాంగ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది.ఇక ఆ పాట కోసం దాదాపు 6.5కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన సాంగ్ అని చెప్పవచ్చు.
పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషల్లో క్లిక్కయ్యేలా హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సాంగ్ ను ఆగస్ట్ 1న విడుదల చేయాలని అనుకుంటున్నారట. మరి కీరవాణి కంపోజ్ చేసిన పాటలో మన అగ్ర హీరోలు ఏ విధంగా కనిపిస్తారో చూడాలి. ఇక పరిస్థితులు అనుకూలిస్తే సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!