వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

వెంకటేష్ దగ్గుబాటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి విక్టరీ వెంకటేష్ గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మన వెంకీమామ. ఓ సినిమా వేడుకలో నాని మాట్లాడుతూ.. ‘వెంకటేష్ గారు అచ్చ తెలుగు ఆవకాయ లాంటి వారు, ఆయన్ని ఇష్టపడని వారంటూ ఉండరు’ అంటూ ఓ కామెంట్ చేసాడు. అది నూటికి నూరు శాతం నిజం. టాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరోల్లో వెంకటేష్ కు ప్రత్యేక స్థానం ఉంది. అందరి హీరోల్లా ఈయన మాస్ ఇమేజ్ కోసం పరితపించిపోలేదు.కెరీర్ ప్రారంభం నుండీ కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలనే చేస్తూ వచ్చారు. హిట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న హీరో కూడా ఇతనే..! ఇటీవల ‘నారప్ప’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వెంకటేష్. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

సినిమా సో సో గా ఉన్నా.. వెంకటేష్ మాత్రం తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో కొంతమంది మాత్రం వెంకటేష్ నటనని ధనుష్ నటనని కంపేర్ చేసి.. వెంకటేష్ ను ట్రోల్ చేస్తున్నారు. అలాగే వెంకీ రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తారు అని కూడా మన తెలుగు ప్రేక్షకులే కామెంట్లు చేస్తుండడం చింతించదగ్గ విషయమనే చెప్పాలి. ఎందుకంటే ధనుష్ కంటే ముందు నుండీ వెంకీ డిఫరెంట్ రోల్స్ చేస్తూ వచ్చారు. వెంకీతో ధనుష్ ను కంపేర్ చేసేంత స్థాయికి.. అతను ఇంకా ఎదగలేదు. వెంకీ రీమేక్ సినిమాలు చేసి ఉండచ్చు కానీ.. అందులో వెంకీ నటన చూసి ఒరిజినల్ లో నటించిన వారు అలాగే ఒరిజినల్ ను తెరకెక్కించిన వారు కూడా ఆశ్చర్యపోయారు అంటే అతిశయోక్తి లేదు. ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయిన తర్వాత తమిళ్ లో ధనుష్ చేసాడు. ఆ సినిమాని కనుక చూస్తే వెంకటేష్ చేసిన దాంట్లో 10వ వంతు కూడా ధనుష్ చేయలేదు అనే అనుమానం కలుగక మానదు. అలా అని ధనుష్ ను తక్కువ చేయకూడదు. అతను గొప్ప నటుడే.. అయితే అతనికి నేషనల్ అవార్డులు వచ్చాయి కదా అని వెంకటేష్ ను తక్కువ చేయడం తప్పు. నిజానికి రీమేక్ సినిమాలో నటించడం అంత ఈజీ కాదు. ముందుగా ఆ పాత్రని ఎంతో ఓన్ చేసుకుంటేనే కానీ… ఆ పాత్రకి హీరో న్యాయం చేసే అవకాశం ఉండదు. అయితే వెంకటేష్ మాత్రం ఎంతో ఈజ్ తో చాలా రీమేక్ లలో నటించారు. అందులో కొన్ని కల్ట్ క్లాసిక్స్ గా నిలిచాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) సూర్యవంశం :

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘సూర్యవంశం’ ని అదే టైటిల్ తో తెలుగులోకి రీమేక్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇది తమిళ రీమేక్ అంటే ఎవ్వరూ నమ్మలేరు. అంత అద్భుతంగా వెంకీ నటించి మెప్పించారు.

2) జెమిని :

ఇది తమిళంలో విక్రమ్ నటించిన మూవీ. ఇది అక్కడ యావరేజ్ గా ఆడింది. తెలుగులో మాత్రం ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ విక్రమ్ కంటే కూడా వెంకీ అద్భుతంగా నటించాడు అనడంలో సందేహం లేదు.

3) ఘర్షణ :

తమిళ్ లో సూర్య నటించిన ‘కాకా కాకా’ కి ఇది రీమేక్. సూర్య ఎంత గొప్ప నటుడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతన్ని కూడా మరిపించే విధంగా వెంకీ ఆ చిత్రం రీమేక్ అయిన ‘ఘర్షణ’ లో అద్భుతంగా నటించి మెప్పించాడు.

4) ఈనాడు :

‘ఎ వెన్స్ డే’ అనే హిందీ మూవీకి ఇది రీమేక్. ఓ పక్క కమల్ హాసన్ వంటి యూనివర్సల్ హీరో ఉన్నప్పటికీ.. వెంకీ అస్సలు తగ్గడు. అతన్ని డామినేట్ చేసే విధంగా అద్భుతంగా నటించాడు ఈ మూవీలో..!

5) గోపాల గోపాల :

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ కు ఇది రీమేక్. అక్కడ అక్షయ్ కుమార్ పాత్రని తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించాడు. అయితే హిందీలో నటించిన వారితో పోల్చినా.. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో ఉన్నా వెంకటేష్ ఆ గోపాల్ రావు పాత్రకి జీవం పోసాడనే చెప్పాలి.

6) చంటి :

తమిళంలో హిట్ అయిన ‘చిన తంబీ’ కి ఇది రీమేక్. అక్కడ ప్రభు హీరోగా నటించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు సాహసించలేదు. కానీ వెంకటేష్ డేర్ గా ఈ రీమేక్ లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రభు కూడా ఓ సందర్భంగా వెంకీ రేంజ్లో నేను పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు అని ఓపెన్ గా చెప్పాడు అంటే వెంకటేష్ యాక్టింగ్ స్కిల్స్ ఏంటనేది మనం అర్ధం చేసుకోవచ్చు.

7) సుందరకాండ :

తమిళ్ లో భాగ్యరాజ్ నటించిన మూవీ ఇది. అయినప్పటికీ వెంకటేష్ అతన్ని మరిపించే విధంగా నటించి ఆకట్టుకున్నాడు. ఖాళీగా ఉంటే.. ఈ మూవీ ఒకసారి చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారు.

8) గురు :

మాధవన్ నటించిన ‘షాలా ఖదూస్'(హిందీ) అలాగే ‘ఇరుది సుట్రు'(తమిళ్) కి ఇది రీమేక్. అయినప్పటికీ ఒరిజినల్ చూసిన వారు సైతం వెంకీ పెర్ఫార్మన్స్ కు ఫిదా అయిపోతారు అనడంలో అతిశయోక్తి లేదు. అంత బాగా వెంకీ నటించారు.

9) దృశ్యం :

మలయాళంలో మోహన్ లాల్ వంటి స్టార్ హీరో నటించినప్పటికీ.. తెలుగులో వెంకటేష్ తో చేసినప్పుడే ఒరిజినల్ కి వాల్యూ పెరిగింది. తెలుగులో సూపర్ హిట్ అయ్యాకే కమల్ హాసన్ కూడా ఈ రీమేక్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇంకో రెండు దశాబ్దాలు గడిచినా కేబుల్ రాంబాబు పాత్రని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోరు.

10) నారప్ప :

డౌట్ లేదు వెంకటేష్ కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మన్స్ గా ‘నారప్ప’ మూవీని చెప్పుకోవచ్చు. అయితే ఫ్లాష్ బ్యాక్ లో వెంకీ మేకోవర్ అలాగే కథనం ఎలివేషన్స్ విషయంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరింత శ్రద్ధ పెట్టుంటే.. ఇంకా బాగుండేది. ఏమైనా ‘నారప్ప’ కి జీవం పోసింది వెంకీ అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus