ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెనీలియా అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘బాయ్స్’ ‘సత్యం’ ‘బొమ్మరిల్లు’ ‘ఢీ’ ‘సై’ ‘రెడీ’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్, రాంచరణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఈమె నటించింది. కానీ కొత్త హీరోయిన్ల ఎంట్రీతో సహజంగానే ఈమెకు అవకాశాలు తగ్గాయి. ఈ నేపధ్యంలో ఆమె సినిమాలను తగ్గించి బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని 2011లో వివాహం చేసుకుంది.
అయినా ఆమెకు సౌత్‌లో ఈమెకు క్రేజ్ తగ్గలేదు. ఎప్పుడెప్పుడు ఈమె మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే నటిగా కొత్త ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది జెనీలియా. వివరాల్లోకి వెళితే … 2022 లో జెనీలియా ‘వేద్’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్ హీరో. ఇంకో విశేషం ఏంటంటే.. రితేష్ దేశ్ ముఖ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం కూడా జరిగింది.
ఇది ఓ మరాఠీ సినిమా. అక్కడ పెద్ద హిట్ అయ్యింది. అంతేకాదు డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమాకే ఏకంగా 9 అవార్డులు దక్కించుకున్నాడు రితేష్ దేశ్ ముఖ్. బెస్ట్ హీరోయిన్ గా జెనీలియాకి కూడా అవార్డులు లభించాయి. ఇది నిజంగానే రితేష్ దేశ్ ముఖ్ కి (Riteish Deshmukh) గొప్ప విషయం. ఇక ‘వేద్’ సినిమా 2019 లో వచ్చిన తెలుగు సినిమా ‘మజిలీ’ కి రీమేక్.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!