‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

రిలీజ్ కి ముందు ఓ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు ఎలా ఉన్నాయి అనేది ప్రమోషనల్ కంటెంట్ కి వచ్చే రెస్పాన్స్ ను బట్టి తెలుస్తుంది. అందులో భాగంగా వచ్చే ట్రైలర్ చాలా కీలకంగా మారుతుంది. ట్రైలర్ కి కనుక పాజిటివ్ రెస్పాన్స్ వస్తే.. సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. ఒకవేళ బాగోకపోతే అంచనాలు తగ్గిపోతాయి. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. కొన్ని ట్రైలర్లు రిలీజ్ అయిన 24 గంటల్లో రికార్డు వ్యూస్ సాధించి దుమ్ములేపాయి. ఆ ట్రైలర్స్ ఏంటో.. వాటికి 24 గంటల్లో నమోదైన వ్యూస్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) గుంటూరు కారం :

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత రూపొందిన ‘గుంటూరు కారం’ ట్రైలర్ 24 గంటల్లో ఏకంగా 37.68 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది.

2) సలార్ :

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన ‘సలార్’ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 32.58 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.

3) సర్కారు వారి పాట :

మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 26.77 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.

4) రాధే శ్యామ్ :

ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 23.20 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.

5) ఆచార్య :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 21.86 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.

6) బాహుబలి 2 :

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 21.81 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.

7) ఆర్.ఆర్.ఆర్ :

రాంచరణ్ – ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 20.45 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.

8) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ 24 గంటల్లో 19.38 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.

9) ‘బ్రో’ :

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 19.25 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.

10) వకీల్ సాబ్ :

పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 18.05 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.

11) లైగర్ :

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 16.80 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.

12) పుష్ప :

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 15.19 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.

13) స్కంద :

రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 13.20 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.

14) మాచర్ల నియోజకవర్గం :

నితిన్ హీరోగా ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 13.11 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.

15) స్కంద(రిలీజ్ ట్రైలర్) :

రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన (Skanda) ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ 24 గంటల్లో 13.93 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus