సినీ ప్రపంచంలో ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో సాగుతుంది. ఒకసారి విజయం శిఖరంలో కూర్చోబెడితే.. అపజయం పాతాళంలోకి తోసేస్తుంది. ఇలాంటి సమయంలో తారలకు తోడుగా ఉండేది కుటుంబ సభ్యులే. సినీ స్టార్లకు ఎప్పుడూ వెంటే ఉండి వెన్నుగా నిలిచినా .. వారు ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంటారు. ఫోటో క్లిక్ లకు చిక్కరు. మనం అభిమానించే హీరోలు తమ తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న అరుదైన ఫోటోలు ఇవి..
ప్రభాస్యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. అందుకే సినీ ఫోటో గ్రాఫర్లకు వారి ఫోటోలు చిక్కలేదు. ప్రభాస్ కూడా అంతే మీడియా ముందు మాట్లాడటానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఒక సందర్భంలో ప్రభాస్ తల్లిదండ్రులు ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు, శివ కుమారిలతో ఉన్న ఫోటో ఇది.
సాయి ధరమ్ తేజ్మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా హుషారుగా ఉంటారు. సాయికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఓ కార్యక్రమంలో తమ్ముడు, అమ్మ నాన్నలతో సాయి ధరమ్ తేజ్ కలిసి సరదాగా ఉన్న సమయం ఇది.
రవితేజమాస్ మహారాజ్ రవితేజ తమ కుటుంబ సభ్యుల గురించే కాదు, పేర్లను కూడా ఇంటర్వ్యూ లలో చెప్పడు. తమ వాళ్ల గురించి అందరికి తెలియడం ఇష్టముండదు. అందుకే రవితేజ ఫ్యామిలీ ఫోటోను మనం చూడలేదు. కొంతకాలం క్రితం కుటుంబ సభ్యులతో రవితేజ తీయించుకున్న చిత్రం ఇది.
అనుష్కసినిమాల్లో ఎంత పేరు సంపాదించుకున్న స్వీటీ సింపుల్ గా ఉండేందుకే ఇష్టపడుతుంది. షూటింగ్ లేనప్పుడు బయట పార్టీలకు రాదు. ఇంట్లో అమ్మ, నాన్న, అన్నలతోనే ఉండేందుకు ఇష్టపడుతుంది. అనుష్క చిన్న ఫ్యామిలీ ఇదే.
దేవీ శ్రీ ప్రసాద్రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కి ఇద్దరు తమ్ముళ్ళతో పాటు చెల్లె కూడా ఉంది. దేవీ మంచి అన్నగానే కాదు.. రచయిత సత్యమూర్తికి తగ్గ కొడుకుగా నిరూపించుకున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి ఫ్యామిలీ ఇది.
తనికెళ్ల భరిణిసినిమాల్లో తనికెళ్ల భరిణి అనేక వేషాలు వేసారు. హీరోలకు తండ్రిగా మెప్పించారు. నిజ జీవితంలోనూ మంచి నాన్నగా, భాద్యతలు మరచిపోనీ భర్తగా ఉన్నారు. పిల్లలు, భార్యతో కలిసి తనికెళ్ల భరిణి ఆనందంగా గడిపిన క్షణం ఫోటో రూపంలో..
నరేష్హీరోగా విజయాలు అందుకుని, ప్రస్తుతం కీలక పాత్రలు చేస్తున్ననరేష్ కి ముగ్గురు మగ పిల్లలున్నారు. కొడుకులతో, భార్యతో కలిసి ఇంట్లో తీయించుకున్న ఫోటో ఇది.
అజయ్వెండితెరపై ఆవేశంగా ఊగిపోయే పాత్రల్లో నటించే అజయ్ ఇంటి వద్ద ఎంతో కూల్ గా ఉంటాడు. తన భార్యను, పిల్లలను ప్రేమగా చూసుకుంటాడు. అజయ్ క్యూట్ ఫ్యామిలీకి నిదర్శనమే ఈ ఫోటో.