‘బేబి’తో చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఈ సినిమాలో ఆమె మూడు రకాల షేడ్స్ కలిగిన పాత్రని పోషించింది. ఒక పాత్రలో అమాయకంగా … అలాగే డీగ్లామరస్ గా, మరో పాత్రలో మోడరన్ గా, ఇంకో పాత్రలో అయితే ఇద్దరు హీరోలను మోసం చేసే యువతిగా ఇలా తన నట విశ్వరూపం చూపించింది అని చెప్పొచ్చు. ఈ సినిమా వల్ల ఆమెకు క్రేజ్ ఏర్పడింది అన్నది ఎంత నిజమో చాలా మంది ఈమెను తిట్టుకున్నారు అని కూడా చెప్పొచ్చు.
ఏదేమైనా ఇప్పుడు ఈమె (Vaishnavi Chaitanya) బిజీ హీరోయిన్ అయిపోయింది. అయితే కెరీర్ ప్రారంభంలో ఈమె చాలా కష్టాలు పడిందట. ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య మాట్లాడుతూ… ‘యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తున్న రోజుల్లో ఓ రోజు డ్రెస్ చేంజ్ చేసుకునేందుకు బాత్ రూమ్ కి వెళ్ళాను. నాకంటూ సెపరేట్ రూమ్ లేకపోవడంతో బాత్రూమ్లోనే డ్రెస్ మార్చుకోవాల్సి వచ్చేది. అయితే ఒకసారి నేను అక్కడ డ్రెస్ ఛేంజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే నా తల్లి చూసి బాధతో ఏడ్చేసింది.
ఇక సినిమాల్లో నటించడం మొదలుపెట్టాక .. స్టార్స్ వ్యానిటీ వ్యాన్ వాడుకోవడానికి అనుమతి అడిగితే చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. 10 వ తరగతిలోనే నా కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. బర్త్ డే పార్టీలు, ఫంక్షన్స్ వంటి వాటిలో డ్యాన్స్ చేస్తే రోజుకు రూ. 700 ఇచ్చేవారు. ఆ డబ్బులు అలా మా అమ్మ చేతికి ఇస్తే చాలా సరుకులు కొనేది’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్