Movies: ‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

  • August 19, 2023 / 11:49 AM IST

2023 లో 8వ నెలలోకి అడుగుపెట్టాం. అప్పుడే సగం నెల అయిపోయింది. ఏడాది ప్రారంభం నుండి ప్రతి వారం రెండు, మూడు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. కోవిడ్ కారణంగా పెండింగ్లో ఉన్న చాలా సినిమాలు ఈ ఏడాది రిలీజ్ ను దక్కించుకున్నాయి. ఇప్పటివరకు 200 కి పైగా సినిమాలు రిలీజ్ అయితే.. అందులో సక్సెస్ అయినవి 20 లేదా గట్టిగా ఉంటే 30 శాతం అనుకోవచ్చు. ఇందులో బాక్సాఫీస్ వద్ద భారీగా సందడి చేసిన సినిమాలు కూడా తక్కువే. ఓపెనింగ్స్ తో రచ్చ చేసిన సినిమాలు అంతంతమాత్రమే. ఏ సినిమాకి అయినా ఓపెనింగ్స్ చాలా ముఖ్యం. అవి రావాలి అంటే సినిమా పై బజ్ ఉండాలి. లేదు అంటే ఆ సినిమాలకు ఓపెనింగ్స్ రావు.

ఈ విషయాన్ని 2023 లో చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అద్భుతాలు చేసిన చిన్న సినిమాలు ఉన్నాయి.. అదే విధంగా మొదటి రోజు నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే చతికిలపడ్డ పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే 2023 మొదటి వారం అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు (Movies) ఏంటో .. లిస్ట్ లో ఉన్న టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం రండి :

1) వాల్తేరు వీరయ్య :

మెగాస్టార్ చిరంజీవి – మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి బాబీ దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో రూ.79.28 కోట్ల షేర్ ను రాబట్టింది.

2) ఆదిపురుష్ :

ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ అయ్యింది. మొదటి వారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.75.86 కోట్ల షేర్ ను రాబట్టింది.

3) వీరసింహారెడ్డి :

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయ్యింది. మొదటి వారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.58.12 కోట్ల షేర్ ను రాబట్టింది.

4) బ్రో :

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 28న రిలీజ్ అయ్యి మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో రూ.49.74 కోట్ల షేర్ ను రాబట్టింది.

5) దసరా :

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30 న రిలీజ్ అయ్యి మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో రూ.38.15 కోట్ల షేర్ ను రాబట్టింది.

6) జైలర్ :

రజినీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10 న రిలీజ్ అయ్యి మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో రూ.31.08 కోట్ల షేర్ ను రాబట్టింది.

7) విరూపాక్ష :

సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 21న రిలీజ్ అయ్యి మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో రూ.24.99 కోట్ల షేర్ ను రాబట్టింది.

8) భోళా శంకర్ :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్ అయ్యి మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో రూ.23 కోట్ల షేర్ ను రాబట్టింది.

9) బేబీ :

ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 14న రిలీజ్ అయ్యింది. మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.20.06 కోట్ల షేర్ ను రాబట్టింది.

10) సార్ :

ధనుష్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ద్విభాషా చిత్రం.. మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో రూ.12.03 కోట్ల షేర్ ను రాబట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus